ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ - అమరావతి కేంద్రంగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి మూడు పార్టీలు రాజ్యసభ .. ఎమ్మెల్సీ స్థానాల్లో షేరింగ్ తో ముందుకు వెళ్తున్నాయి. ఇక, వైసీపీ ముఖ్య నేతగా వ్యవహరించిన సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు చోటు చేసుకుంటున్న తాజా సమీకరణాల వేళ సాయిరెడ్డి అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా కొత్త వ్యూహంతో సిద్దం అవుతున్నట్లు సమాచారం.

విజయ సాయిరెడ్డి నాడు వైఎస్ .. ఆ తరువాత జగన్ వద్ద కీలకంగా వ్యవహరించారు. వైసీపీ తొలి రాజ్యసభ సభ్యుడుగా పని చేసారు. 2024 ఎన్నికల ఫలితం తరువాత చోటు చేసుకున్న వరుస పరిణామాలతో సాయిరెడ్డి ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ రాజ్యసభ పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేసారు. జగన్ ఆ తరువాత సాయిరెడ్డి రాజీనామా పైన కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయాల్లో ఉన్న వారికి విలువలు ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పైన సాయిరెడ్డి సైతం స్పందించారు. తాను వ్యవసాయం చేసుకుంటానని.. ఏ పార్టీలో చేరే అవకాశం లేదని తేల్చి చెప్పారు. దీంతో, సాయిరెడ్డి ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని డిసైడ్ అయిపోయారు. ఇక.. రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్న సాయిరెడ్డి తాజాగా ఇటీవల రాజ్యసభ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఉప రాష్ట్రపతి థన్ కర్ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో ప్రత్యక్షం అయ్యారు. సాయిరెడ్డికి ఆయన సైతం ప్రాధాన్యత ఇచ్చారు. సాయిరెడ్డి ఆకస్మికంగా ఈ పర్యటనలో ప్రత్యక్షం అవ్వటం ద్వారా కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. సాయిరెడ్డి కి బీజేపీలోని ముఖ్య నేతలతో ఉన్న సత్సంబంధాలు చర్చకు వస్తున్నాయి.

ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా కొత్త చర్చ జరుగుతోంది. సాయిరెడ్డి తిరిగి రాజకీయంగా జూన్ నెల నుంచి యాక్టివ్ కానున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, వైసీపీ నుంచి కాకుండా బీజేపీలోకి సాయిరెడ్డి ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఈ ప్రచారం సారాంశం. 2019 ఎన్నికల ముందు.. ఆ తరువాత బీజేపీ - వైసీపీ మధ్య వారధిగా సాయిరెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లుగా సాయిరెడ్డి బీజేపీకి దగ్గరైతే వైసీపీతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారనే చర్చ మొదలైంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా యాక్టివ్ అవ్వటం ఖాయమని.. అయితే, ఏ పార్టీలో ఉంటారు.. ఎలాంటి పాత్ర పోషిస్తారనేదే తేలాల్సి ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో కొనసాగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos