రాజకీయాల్లో శత్రు క్యాంపుల్లో చేరి వారి సీక్రెట్స్ పసిగట్టి దొంగ దెబ్బ తీయడం పలు సినిమాల్లో కథాంశాలుగా వచ్చాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతుండడంతో.. ఇదేదో రాజకీయ సినిమా కథాంశం లాగా ఉందే అని   రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చించుకుంటున్నారు. జగన్ లేకుండా విజయసాయిరెడ్డి లేరు, విజయసాయిరెడ్డి లేకుండా జగన్ లేరు అన్నంతటి బలమైన బంధం వీరిది. అటువంటిది వీరి మధ్య దూరం పెరిగింది. విజయసాయిరెడ్డి పార్టీకి దూరం అయ్యారు. ఏడాది తర్వాత ఇప్పుడు బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. విజయసాయిరెడ్డి ఢిల్లీ కేంద్రంగా రాజకీయం చేయడంలో దిట్ట. వైసీపీ తరపున ఢిల్లీ రాజకీయాలు చక్కబెట్టినప్పుడు ఆయన బీజేపీ పెద్దలతో దగ్గర సంబందాలు పెట్టుకున్నారు. అవే సంబంధాలతో ఆ పార్టీలో చేరబోతున్నారని చెబుతున్నారు. అయితే ఆయన బీజేపీలో చేరేది వైసీపీ, జగన్ ప్రయోజనాల కోసమేనన్న చర్చలు జరుగుతున్నాయి.

కూటమిలో ప్రస్తుతం బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి ఉన్నాయి. ఈ ఐక్యతను దెబ్బకొట్టాలన్నా, కేంద్రం వద్ద చంద్రబాబుకున్న ప్రాబల్యాన్ని తగ్గించాలన్నా బీజేపీ లోపల ఒక బలమైన గొంతు వైసీపీకి అవసరం. ఆ లోటును భర్తీ చేయడమే సాయిరెడ్డి అసలు లక్ష్యమని గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరితే, అది రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో అనిశ్చితికి దారితీసే అవకాశం ఉంది. బీజేపీని టీడీపీకి దూరం చేసేలా పావులు కదపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అండర్‌కవర్ స్పై తరహాలో బీజేపీలోని కీలక నేతలను ప్రభావితం చేస్తూ, వైసీపీకి పరోక్షంగా లాభం చేకూర్చే లోపలి మనిషి గా ఆయన వ్యవహరించవచ్చని భావిస్తున్నారు.ఈ విభేదాల డ్రామా అంతా బీజేపీలోకి ప్రవేశించడానికి వేసిన రెడ్ కార్పెట్ స్కెచ్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

విజయ సాయిరెడ్డి... జగన్ కు దూరమైనట్లుగా క్రియేట్ చేసిన సీన్ల తర్వాత ఆయన జనసేన లేదా టీడీపీలో చేరాలని అనుకున్నారు. కానీ జనసేన, టీడీపీల తలుపులు ఆయనకు దాదాపు మూసుకుపోయిన తరుణంలో, బీజేపీ మాత్రమే ఆయనకు ఏకైక మార్గం. కానీ, ఏళ్ల తరబడి జగన్ నీడలా సాగిన వ్యక్తి ఒక్కసారిగా మనసు మార్చుకున్నారంటే అది రాజకీయ అవసరమా లేక పక్కాగా సిద్ధం చేసిన స్క్రిప్టా అన్నదే అసలు పాయింట్. కేంద్రంలో కూటమి నేతలు ఎంతో ఐకమత్యంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో..  విజయసాయిరెడ్డి ఢిల్లీ పర్యటనలు, బీజేపీ అగ్రనేతలతో చర్చలు సఫలం అవుతాయా అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos