ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ఆ తర్వాత ప్రభుత్వం మారగానే ఎంపీ పదవికీ, రాజకీయాలకూ గుడ్ బై చెప్పేసి వ్యవసాయం చేసుకుంటున్న విజయసాయిరెడ్డి.. రాజకీయంగా యాక్టివ్ గానే ఉంటున్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్నాక వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఎక్స్ లో ట్వీట్లు పెట్టడం, బహిరంగ వ్యాఖ్యలు చేయడం దగ్గరి నుంచి విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వడం వరకూ చాలా చేశారు. ఇదే క్రమంలో ఇప్పుడు సాయిరెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవలే రేణిగుంటలోని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం పేరును శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ ఎయిర్ పోర్టుగా మార్చాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ఈ నిర్ణయంపై విజయసాయిరెడ్డి స్పందించారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయానికి విజయసాయిరెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్టు కూడా పెట్టారు. రేణిగుంట ఎయిర్ పోర్టు (తిరుపతి ఎయిర్ పోర్టు)కు శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ ఎయిర్ పోర్టుగా పేరు మారుస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం శ్రీ వెంకటేశ్వరుడికి అంతర్జాతీయంగా ఉన్న ప్రాధాన్యతను, తిరుమల ఆధ్యాత్మిక వారసత్వానికి గౌరవం ఇచ్చేలా ఉందని సాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు పేరు మార్పుపై చర్యలు తీసుకోవాలని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడిని ఆయన కోరారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos