మాజీ ఎంపీ సాయి రెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ ఖాయం అయింది. తిరిగి రాజకీయంగా యాక్టివ్ కానున్నట్లు తేల్చి చెప్పారు. కూటమి కొనసాగితే జగన్ కు అధికారం సాధ్యం కాదని,  అదేవిధంగా కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్ కు అధికారం దక్కదని చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరటం లేదంటూనే... ఒక కీలక సంకేతం ఇచ్చారు. దీంతో.. సాయిరెడ్డి భవిష్యత్ ప్రణాళికల పైన క్లారిటీ వస్తోంది. తాను రాజకీయాలకు స్వస్తి చెప్పలేదని, తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తానని సాయి రెడ్డి తేల్చి చెప్పారు. అయితే, ఏ పార్టీలో చేరనని ట్విస్ట్ ఇచ్చారు. అదే సమయంలో జగన్ తిరిగి అధికారంలో కి రావాలంటే కూటమి కొనసాగితే కష్టమని.. కూటమిని దెబ్బ తీసే విధంగా వ్యూహాలు...రాజకీయ ఆలోచనలు ఇచ్చే ఆలోచనలు జగన్ కోటరీకి లేవని వ్యాఖ్యానించారు. కూటమి.. కోటరీ కారణంగా జగన్ కు అధికారం దక్కదంటూ ఆసక్తి కర విశ్లేషణ చేసారు. దురదృష్టం కొద్దీ జగన్‌ కూడా కోటరీ మాటలు నమ్మారని 2020 నుంచి తనని సైడ్‌లైన్‌ చేశారని విజయసాయిరెడ్డి చెప్పారు. మద్యం స్కామ్‌ అనేదాన్ని తాను నమ్మడం లేదని చెప్పుకొచ్చారు. విశాఖలో ఒక్క అపార్ట్‌మెంట్‌ తప్ప నాకేమీ లేదని అలానే తనపై దుష్ప్రచారం చేసిన వారికి సరైన బుద్ధి చెబుతానన్నారు. తాను జగన్ కోసం పాలేరులా పని చేసానని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

అదే సమయంలో తన కొత్త రాజకీయ ప్రస్థానం పైన కొత్త సంకేతాలు ఇచ్చారు. తాను జగన్ ను విమర్శించలేదని.. జగనే తన పైన ఆరోపణలు చేసారని గుర్తు చేసారు. తాను ప్రలోభాలకు లొంగానని జగన్ చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని సూచించారు. అయితే.. సాయిరెడ్డి వైసీపీని వీడిన సమయంలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఆ తరువాత టీడీపీ నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు ఆ ప్రతిపాదన నిలిచినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరిగింది. కాగా.. తిరిగి పార్టీలోకి సాయిరెడ్డిని తీసుకొచ్చేందుకు వైసీపీలోనూ ప్రయత్నాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇక.. సాయిరెడ్డి జనసేనలో చేరుతారని మరికొందరు భావించారు. అయితే, ఏపీలో కూటమిలో సాయిరెడ్డికి ఛాన్స్ లేదని చెబుతున్నారు. దీంతో.. బీజేపీ అధినాయకత్వంతో సాయిరెడ్డికి ఉన్న సత్సంబంధాలతో కమలం పార్టీకి దగ్గరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా .. బీజేపీ నుంచి ఆహ్వానం అందితే పరిశీలిస్తానని సాయిరెడ్డి చెప్పటం ద్వారా.. ఆయన కొత్త రాజకీయ ప్రస్థానం.. వ్యూహాలు ఏంటనేది స్పష్టం కావాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos