ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ తర్వాత నంబర్ టూగా ఉన్న అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు ఓ కేసులో ఆయనకు భారీ ఊరట కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో ఆయనకు కీలక షరతు కూడా విధించింది.

సజ్జల రామకృష్ణారెడ్డి గత జగన్ సర్కార్ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ ఆయన్ను అరెస్టు చేయకుండా పోలీసులకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

అదే సమయంలో ఈ కేసులో దర్యాప్తుకు పోలీసులకు పూర్తిగా సహకరించాలని సజ్జల రామకృష్ణారెడ్డిని హైకోర్టు ఆదేశించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో తనకు సంబంధం లేదని, ఈ కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూల ఆధారంగా తనను పోలీసులు ఏ 120గా కేసులో చేర్చారని సజ్జల తెలిపారు. దీంతో అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆయన అరెస్టు కాకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 25కు వాయిదా వేసింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos