ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని అధికారులు విజయవాడకు తీసుకువచ్చారు. విజయవాడ సీపీ కార్యాలయం నుంచి సజ్జల శ్రీధర్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. మే 6వ తేదీ వరకు శ్రీధర్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.
ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఓనర్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. లిక్కర్ కేసులో ఏ6 గా ఉన్న శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు శుక్రవారం హైదరాబాదులో అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. వైసీపీ హయాంలో అమలు చేసిన నూతన మద్యం విధానంలో కోట్ల రూపాయల ముడుపులు కొల్లగొట్టడానికి నిర్వహించిన సమావేశాలలో వైసీపీ నేతలతో కలిసి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీఎస్ డీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, అప్పటి నైటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, ఏపీఎస్ బీసీఎల్ స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ లిక్కర్ పాలసీ ముడుపులపై చర్చించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులోనే ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ కావడంతో న్యాయస్థానం రిమాండ్ విధించింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇటీవల రాజ్ కసిరెడ్డిని పోలీసులు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగారిమాండ్ విధించారు. ఈ కేసులో A1. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, A2. దొంతి రెడ్డి వాసుదేవ రెడ్డి, A3. దొడ్డ వెంకట సత్య ప్రసాద్, A4. పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, A5. విజయ సాయి రెడ్డి, A6. సజ్జల శ్రీధర్ రెడ్డి, A7. ముప్పిడి అవినాష్ రెడ్డి, A8. బూనెటి చాణక్య, A9. తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, A10. సైఫ్ అహ్మద్ సహా మరికొందరు నిందితులు ఉన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos