ఏపీ రాజధాని అమరావతికి వరద ముప్పు పొంచి ఉందన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. వరద ముప్పు నివారణకు అమరావతి రాజధానిలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో కార్యాచరణ కూడా ప్రారంభించబోతోంది. అమరావతి రాజదాని ప్రాంతాన్ని కృష్ణా నది వరదల నుంచి రక్షించేందుకు గతంలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 

అయితే దీంతో వరదలకు పూర్తిస్ధాయిలో అడ్డుకట్టే వేయడం సాధ్యం కాదన్న అంచనాల నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్మాణానికి సిద్ధమవుతున్న ప్రభుత్వానికి రుణాలు ఇవ్వబోతున్న ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు పలు సూచనలు చేశాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం రాజధానిలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి అదనంగా మరో ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు సిద్దమవుతోంది. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం పక్కనే మరో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం కోసం డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించింది. 7350 క్యూసెక్కుల సామర్ధ్యంతో ఈ కొత్త ఎత్తిపోతల పథకానికి డీపీఆర్ తయారు చేయబోతున్నారు. దీనికి అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏడీసీఎల్ టెండర్లను కూడా ఆహ్వానించింది. ఫిబ్రవరి 14 వరకూ టెండర్లు ఆహ్వానించారు. 

గతంలో టీడీపీ ప్రభుత్వం కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని రూ.237 కోట్లతో కేవలం 18 నెలల్లోనే పూర్తి చేసింది. దీంతో ఇప్పుడు కొత్త ఎత్తిపోతల పథకాన్ని సైతం వేగంగా పూర్తి చేయడం ద్వారా వరదల్ని నివారించనున్నారు. దీనిపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos