విజయవాడ కేంద్రంగా అద్భుతం ఆవిష్కరణ కానుంది. రాష్ట్రంలో సీ ప్టేన్ సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందుకు పున్నమి ఘాట్ వేదిక కానుంది. గతంలోనే సీప్లేన్ సేవలను ప్రారంభించాలని భావించారు. కానీ, ఇప్పుడు ఇందుకు ముహూర్తం ఖరారైంది. విజయవాడ కేంద్రంగా ఈ నెల 9న పున్నమిఘాట్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్‌ నుప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. డీ హవిల్లాండ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్ ను ప్రారంభించేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ సీ ప్లేన్ పున్నమి ఘాట్ నుంచి బయల్దేరి శ్రీశైలంలోని పాతాళగంగ బోటింగ్‌ పాయింట్‌ వద్ద ఉన్న పాత జెట్టీ వద్ద దిగేందుకు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాబోయే రోజుల్లో రెగ్యులర్‌ సర్వీసు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ముందుగా విజయవాడ టు శ్రీశైలం, అదే విధంగా శ్రీశైలం టు విజయవాడ మధ్య సీ ప్లేన్ ప్రయోగం విజయవంతం అయితే ఈ రూటుతో పాటుగా మరిన్ని ప్రాంతాల్లో రెగ్యులర్ సర్వీసులు అందు బాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అదే విధంగా రెండోవిడతలో సాగర తీరం విశాఖలో, నాగార్జున సాగర్, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనూ ఈ సీ ప్లేన్ల ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుత సర్వీసుతో విజయవాడలో అమ్మవారి ఆలయం తో పాటుగా శ్రీశైలం లోని భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి సందర్శనకు వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఈ సీ ప్లేన్ ను అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే నాగార్జునసాగర్​ - శ్రీశైలం బోటు షికారు ప్రారంభం అయింది. దాదాపు 120 కిలోమీటర్ల మేర ఈ ప్రయాణం జరుగుతోంది. పర్యాటకుల నుంచి ఈ ప్రయణానికి భారీ స్పందన కనిపిస్తోంది. నాగార్జున సాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాంత అందాలను వీక్షిస్తూ ఈ ప్రయాణం సాగుతోంది. మరొక మార్గంలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను కూడా టూరిజం శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు కొత్త తరహా ప్రయాణాలు సామాన్యులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు విజయవాడ వేదికగా సీ ప్లేన్ ను కూడా ప్రవేశపెట్టనుండటం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos