ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. జూన్ 12న తొలి విడతగా ఇప్పటికే తల్లుల బ్యాంక్ అకౌంట్‌లలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి.. ఒక్కొక్కరికి రూ.13వేల చొప్పున జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలి విడతలో పలు కారణాలతో కొందరికి డబ్బులు జమ కాలేదు.. అలాగే ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరేవారికి కూడా డబ్బుల్ని ఇవ్వలేదు. ప్రభుత్వం తల్లికి వందనం పథకం తొలి విడతలో డబ్బులు రాని వారు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.. ఆ అప్లికేషన్‌లను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేసింది. అలాగే ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరినవారి లిస్ట్‌ను కూడా రెడీ చేసింది.
స్కూళ్లకు సంబంధించి అర్హులైన తల్లుల జాబితాలను నేరుగా టీచర్ల లీప్ యాప్‌లో పొందుపరుస్తారు. వీరందరికి ఈ నెల 10న అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేస్తారు. అర్హుల జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రభుత్వ వెబ్‌సైట్ https://gsws-nbm.ap.gov.in/ అందుబాటులో ఉంచింది.. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ApplicationStatusCheckP క్లిక్ చేయాలి.. అప్పుడు తల్లికి వందనం పథకాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ' ఆ పక్కనే ఉన్న 2025-26ను సెలక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చాను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే.. పథకానికి సంబంధించి లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది.. దానిని ఆ కాలమ్‌లో ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే తల్లికి వందనం పథకం అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చని' అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 10న అంటే రేపు రెండు విశేషాలు ఉన్నాయి.. ఒకటి తల్లికి వందనం పథకం రెండో విడత డబ్బుల్ని ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేయనుంది. రెండోది రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ (పీటీఎం) నిర్వహించనున్నారు. ఒకే రోజు పీటీఎంతో పాటుగా తల్లికి వందనం డబ్బులు కూడా తల్లుల ఖాతాల్లో జమ చేయనుండటంతో పాఠశాలలో సందడి వాతావరణం ఉండబోతుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos