వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంచలన మలుపు తిరిగింది. తదుపరి దర్యాప్తు కొనసాగించాలని సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తన తండ్రి హత్య కేసు దర్యాప్తు ఇంకా ముగియలేదని..కాల్ రికార్డుల ఆధారంగా మరింత దర్యాప్తు చేసి సూత్రధారులను పట్టుకోవాలని సునీత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సీబీఐ కోర్టు ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. దీంతో సీబీఐ తదుపరి విచారణ కొనసాగించనుంది. వివేకా హత్య గురించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తెల్లవారుజామునే తెలిసిందని  కల్లాం అజేయరెడ్డి గతంలో సీబీఐకి స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆ విషయం దుమారం రేగింది. ఎవరికీ తెలియక ముందే జగన్ కు ఎలా తెలిసిందని ప్రశ్నలు వచ్చాయి. అయితే అప్పటికే సీబీఐ దర్యాప్తు ముగిసింది. తదుపరి దర్యాప్తు జరగలేదు. ఇప్పుడు దర్యాప్తు జరగడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వైఎస్ వివేకా హత్య కేసు ప్రస్తుతానికి ఎక్కడిదక్కడే ఉంది. సుప్రీంకోర్టు గతంలో దర్యాప్తు పూర్తి చేసేందుకు గడువు పెట్టింది. ఆ మేరకు సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి వివరాలను సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్ లో సమర్పించింది. అదే సమయంలో వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి, గంగిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. తదుపరి దర్యాప్తు అవసరమో లేదో...దిగువకోర్టు తేలుస్తుందని..కేసును సీబీఐ కోర్టుకు పంపించారు. విచారణ తరవాత తదుపరి దర్యాప్తు అవసరమని కోర్టు తేల్చింది. మరోవైపు సీబీఐ సమగ్ర విచారణ కొనసాగించడం తమకు సమ్మతమేనంటూ వివేకా హత్య కేసు నిందితుదు సునీల్ యాదవ్ కోర్టుకు తెలిపారు.

వివేకా హత్య కేసు దర్యాప్తునకు గత వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం సహకరించలేదు. దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల మీదనే కేసులు నమోదు చేశారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కర్నూలు పోలీసులు సహకరించకపోవడంతో అరెస్టు చేయలేకపోయారు. ప్రభుత్వంలోని పెద్దలు సీబీఐ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. చివరికి సునీత విచారణను తెలంగాణ హైకోర్టుకు మార్చాలని సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించారు. కొత్తగా దర్యాప్తు చేసే విషయంలో సీబీఐకి ఎలాంటి సహకారం కావాలన్నా పూర్తి స్థాయిలో ఇప్పటి ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని, అందులో ఎలాంటి సందేహం లేదని భావిస్తున్నారు.

వైఎస్ వివేకా హత్య కేసులో రాజకీయ కోణాలు ఉన్నాయని సీబీఐ చెబుతోంది. అందుకే ఈ కేసును వీలైనంత వేగంగా కొలిక్కి తీసుకు వచ్చి ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ దిశగా త్వరలో సీబీఐ మరోసారి విచారణ జరపడం.. ఈ సారి ఆటంకాలు లేకుండా వేగంగా దర్యాప్తు పూర్తి చేసి .. నిందితుల్ని జైులుకు పంపడం ఖాయమని భావిస్తున్నారు. ఈ విషయంలో వచ్చే రెండు, మూడు నెలల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos