ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే 11మందిని సిట్ అరెస్ట్ చేసింది. తాజాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయగా.. కోర్టు రిమాండ్ విధించింది. అయితే తాజాగా ఈ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం తెరపైకి వచ్చింది.. ఫేమస్ లిక్కర్ బ్రాండ్‌ల బడా కంపెనీల పేర్లు బయటకొచ్చాయి. ఆ కంపెనీలు మద్యం వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డాయంటూ ఛార్జ్‌షీట్‌లో పేర్లు ప్రస్తావించారు. ఈ మేరకు సిట్ విచారణలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.. కొన్ని మద్యం కంపెనీలు లంచాలు ఇచ్చి అక్రమంగా లాభాలు పొందాయని చెబుతున్నారు. వీటిలో తిలక్ ఇండస్ట్రీస్, అంబర్ స్పిరిట్స్, ట్రొపికల్, ఎస్‌ఎన్‌జీ షుగర్స్ సహా 12 మద్యం కంపెనీల పేర్లు సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించారు. ఈ మద్యం కుంభకోణంలో ఈ కంపెనీల పాత్రపై దర్యాప్తు జరుగుతోంది.

ఈ మద్యం కుంభకోణంలో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరు కూడా ఉంది. ఈ కంపెనీ మ్యాన్షన్ హౌస్ బ్రాండ్‌ను అమ్ముతుంది. అలాగే అంబర్ స్పిరిట్స్, ట్రాపికల్ ఇన్ బెవ్, SNJ షుగర్స్, B9 బెవరేజెస్ వంటి చాలా కంపెనీలపై ఈ ఆరోపణలు ఉన్నాయి. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) ద్వారా దాదాపు రూ. 1,472 కోట్ల ఆదాయం పొందింది. ఇందులో సుమారు రూ. 218 కోట్లు లంచంగా ఇచ్చిందని సిట్ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. ఈ లంచం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఎక్కువ సరుకు అమ్మడానికి, ధరలు పెంచడానికి ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

SNJ షుగర్స్ కంపెనీ కూడా దాదాపు రూ. 350 కోట్ల వరకు లంచం ఇచ్చిందని పోలీసులు చెబుతున్నారు. UV డిస్టిలరీస్ కంపెనీ సుమారు రూ. 29.80 కోట్లు, PV స్పిరిట్స్ కంపెనీ రూ. 37.92 కోట్లు లంచంగా ఇచ్చాయని ఛార్జ్ షీట్‌లో ఉంది. B9 బెవరేజెస్ కంపెనీ 2019 నుంచి 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద మొత్తంలో మద్యం సరఫరా చేసింది. ఈ కంపెనీ APSBCL నుంచి దాదాపు రూ. 360 కోట్లు పొందిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణలో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కొన్ని అనుమానాస్పద లావాదేవీలు చేసినట్లు సిట్ గుర్తించిందని సమాచారం. APSBCL నుంచి వచ్చిన డబ్బును నాలుగు జ్యువెలరీ కంపెనీల ద్వారా లెక్కల్లో చూపకుండా మార్చారని ఆరోపణలు ఉన్నాయి. తిలక్ నగర్ కంపెనీ APSBCLలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి భారీగా అమ్మకాలు చేసిందని ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. ఈ లాభాన్ని నిలుపుకోవడానికి.. తన ఆదాయంలో కొంత భాగాన్ని నగల వ్యాపారులకు మళ్లించిందని.. ఆ నగల ద్వారా వచ్చిన బంగారాన్ని సిండికేట్ సభ్యులకు చేర్చిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా చేయడం ద్వారా ఈ వ్యవహారమంతా చట్టబద్ధమైన వ్యాపారంగా కనిపించేలా జాగ్రత్త పడ్డారని చెబుతున్నారు.. జీఎస్టీ కట్టినట్లు కూడా చూపించారు. కానీ నిజానికి ఇది తెల్ల డబ్బును నల్ల డబ్బుగా మార్చే ఒక పద్ధతి అంటోంది సిట్. పెద్ద కంపెనీలు కూడా తమ ఆదాయంలో కొంత భాగాన్ని బంగారంగా మార్చి లంచాలుగా ఇవ్వడానికి సిద్ధపడ్డాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. తమకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదని చెబుతోంది. 'ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో చాలా మంచి పాలన అందించారు.. పరిశ్రమ అభివృద్ధికి ఆయన ఎప్పుడూ ప్రోత్సాహం అందించారు. పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందిస్తే ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఈసారి కూడా ఆయన పరిశ్రమకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాను' అన్నారు తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అమిత్ దహనుకర్.

ఇక 'B9 బెవరేజెస్‌కు సంబంధించిన బిరా కంపెనీకి సరుకులు సరఫరా చేసే సంస్థలు.. ఎలాంటి ప్యాకేజింగ్ మెటీరియల్స్,  ముడి సరుకులు సరఫరా చేయకుండానే నకిలీ బిల్లులు సృష్టించాయి.. ఆ డబ్బును మార్చి B9 బెవరేజెస్ కంపెనీకి చేర్చాయి' అని సిట్ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు మద్యం తాగే రాష్ట్రాల్లో టాప్ 3లో ఉండేది.. కానీ గత ఐదేళ్లలో అమ్మకాలు సగానికి పడిపోయాయి అంటున్నారు. ధరలు పెంచడంతో పాటుగా, లోకల్ కంపెనీలకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణమని అంటున్నారు. గత ఏడాది అక్టోబర్‌ నుంచి ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేస్తోంది.. రిటైల్ అవుట్‌లెట్‌ల సంఖ్యను పెంచింది. మొత్తానికి లిక్కర్ స్కాం కేసులో మరో కొత్త అంశం బయట పడటం సర్వత్రా చర్చనీయాంశమైంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos