ఏపీలోని చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన మేయర్‌ కఠారి అనురాధ - మోహన్‌ దంపతుల హత్య కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత వెలువడిన ఈ తీర్పులో ఐదుగురు నిందితులను దోషులుగా తేల్చి ఉరిశిక్ష విధించింది. పదేళ్లుగా ఈ కేసు నడుస్తుండగా దాదాపు 352 సార్లు వాయిదా పడగా 130 మంది సాక్షులను విచారించారు. ఉరిశిక్ష ఖరారైన నేపథ్యంలో దోషులకు వైద్య పరీక్షలు నిర్వహించి కడప జైలుకు తరలించనున్నారు. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కఠారి మోహన్‌.. మేయర్‌గా అనురాధ ఉన్నారు. కాగా మోహన్ మేనల్లుడు చింటూ అలియాస్ శ్రీరామ్‌ చంద్రశేఖర్‌. మోహన్ కి చింటూకి మధ్య వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్‌గా ఉన్న అనురాధ, మేనమామ మోహన్‌ను అడ్డు తొలగించుకోవాలని చింటూ నిర్ణయించుకున్నాడు. 2015 నవంబరు 17న చింటూ.. మరో నలుగురు బురఖాలు ధరించి తుపాకులు, కత్తులతో చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి ప్రవేశించారు. ముందుగా కఠారి అనురాధపై చింటూ, మరికొందరు తుపాకులతో కాల్పులు జరపగా ఆమె అక్కడే నేలకొరిగారు. వెంటనే పక్క గదిలో ఉన్న కఠారి మోహన్‌ పై దాడి చేసి కత్తులతో నరికారు. అయితే కొన ఊపిరితో ఉన్న మోహన్‌ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మరణించారు. ఇక మేయర్‌ దంపతులను చంపే క్రమంలో అక్కడే ఉన్న వేలూరి సతీష్‌ కుమార్‌ నాయుడిని కూడా చంపేందుకు మంజునాథ్‌ (ఏ4) యత్నించారు.

హంతకులకు ఆయుధాలు సమకూర్చడం, ఆశ్రయం ఇవ్వడం, ధనసాయం చేశారని మరో 16 మందిపై పోలీసులు అభియోగం మోపగా విచారణలో రుజువు కాలేదు. దీంతో వారిని నిర్దోషులుగా పేర్కొన్నారు. ఈ కేసులో తొలుత 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. కాసరం రమేష్‌ (ఏ22) తనకు కేసుతో సంబంధం లేదని పిటిషన్‌ దాఖలు చేయగా అతడి పేరును తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌.శ్రీనివాసాచారి (ఏ21) కేసు విచారణ సాగుతుండగానే మృతిచెందగా మిగిలిన 21 మంది నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చింటూ (ఏ1), గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్‌ వెంకటేష్‌ (ఏ2), జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జయారెడ్డి (ఏ3), మంజునాథ్‌ అలియాస్‌ మంజు(ఏ4), మునిరత్నం వెంకటేష్‌(ఏ5) లకు ఉరిశిక్ష విధించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos