తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులపై బెంగళూరులోని సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాడు అక్రమాస్తుల కేసులో జయలలిత అరెస్టు కావడం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో అంటే 2004లో ఆమె ఆస్తులను సీజ్ చేయడం జరిగింది. జయలలితకు కొన్ని వేల కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. ఇందులో చెన్నైలోని తన నివాసం పోయెస్ గార్డెన్ నుంచి, బ్యాంకు డిపాజిట్లు, 700 కిలోలకు పైగా వెండి ఆభరణాలు,27 కిలోల బంగారం,1562 ఎకరాల భూమి, వజ్రాభరణాలు, ఖరీదైన రంగురాళ్లు,11వేలకు పైగా చీరెలు,44 ఏసీలు, 750 జతల ఖరీదైన చెప్పులతో పాటు గడియారాలు ఇంకా చాలా విలువైన వస్తువులు ఆమె వద్ద ఉన్నాయి.
ఇక ఆమె మరణం తర్వాత ఈ ఆస్తుల ఎవరికి చెందాలనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరులోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. కేసును విచారణ చేసిన బెంగళూరు 36వ అడిషనల్ సిటీ సివిల్ సెషన్స్ కోర్టు .. ఫిబ్రవరి 14,15వ తేదీల్లోగా జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అంతకుముందు సీజ్ చేయబడ్డ ఆస్తులను తమకు చెందేలా ఆదేశించాలంటూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు జయలలిత మేనల్లుడు జె దీపక్, మేనకోడలు జె.దీప. అయితే ఈ పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు జనవరి 13వ తేదీన కొట్టేసింది. ఆ వెంటనే సీబీఐ కోర్టు జయలలిత ఆస్తులపై ఒక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు కంటే ముందు సీబీఐ కోర్టును ఆశ్రయించగా జయలలిత అవి అక్రమంగా సంపాదించారంటూ ఆ న్యాయస్థానం జడ్జిమెంట్ జడ్జిమెంట్. ఈ తీర్పును సవాలు చేస్తూ దీపక్, దీపాలు హైకోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి చుక్కెదురైంది.
మొత్తానికి సీబీఐ కోర్టు తాజా ఆదేశాలతో జయలలిత అక్రమాస్తుల కేసు ముగింపు దశకు చేరుకుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వానికి జయలలిత ఆస్తులు అప్పచెప్తే ఇక కేసును మూసివేయొచ్చని అంటున్నారు. సుప్రీంకోర్టు కూడా తొలుత ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos