ఏపీలోని ప్ర‌కాశం జిల్లాలో రెండు ఆల్ట్రా మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అసెంబ్లీ వేదికగా ప్ర‌క‌టించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి గొట్టిపాటి మంగ‌ళ‌వారం స‌మాధానం చెప్పారు. దీనికి సంబంధించి మంత్రి గొట్టిపాటి రవికుమార్ స‌భ‌లో మాట్లాడుతూ... రాష్ట్రంలో పున‌రుత్పాద‌క విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రాయ‌ల‌సీమ త‌రువాత ప్ర‌కాశం జిల్లానే అత్యంత అనువైన ప్రాంత‌మని తెలిపారు. ప్ర‌కాశం జిల్లా దొన‌కొండ‌, చంద్ర‌శేఖ‌ర‌పురం ప్రాంతాల్లో మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని, ఒక్కో ప్లాంట్ నిర్మాణానికి సుమారు 5,500 ఎక‌రాల భూమి అవ‌స‌రమని మంత్రి స్పష్టం చేశారు. ప్లాంట్ల నిర్మాణానికి భూకేటాయింపుల‌కు సంబంధించి ఇప్ప‌టికే ప్రకాశం జిల్లా క‌లెక్ట‌ర్ నుంచి నివేదిక కోరామ‌ని, క‌లెక్ట‌ర్ నివేదిక త‌రువాత సోలార్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపడుతామని మంత్రి వివరించారు. ఒక్కో సోలార్ విద్యుత్ ప్లాంట్ ద్వారా సుమారు 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎన‌ర్జీ పాలసీ - 2024 (ఐసీఈ) ద్వారా పున‌రుత్పాద‌క విద్యుత్ రంగంలో ఏపీ దేశంలోనే ప్ర‌థ‌మ స్థానంలో నిలుస్తుంద‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎన‌ర్జీ పాల‌సీ ద్వారా 7.5 ల‌క్ష‌ల మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎన‌ర్జీ పాలసీ పాల‌సీ ద్వారా 100 గిగావాట్ల పున‌రుత్పాద‌క విద్యుత్ ఉత్ప‌త్తి ల‌క్ష్యంగా ముందుకెళ్తున్నామ‌ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీ వేదికగా వివరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos