ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాష్ట్ర ఆర్దిక పురోగతి కి సంబంధించి అవసరమైన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసారు. ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ కి దోహదపడే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. అధికారిక అజెండా తరువాత రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపైన చర్చించారు. మంత్రులు మరింత చొరవతో వ్యవహరించాలని సీఎం నిర్దేశించారు. ప్రతీ మంత్రి తమ శాఖల పైన పట్టు పెంచుకోవటంతో పాటుగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేసారు.

కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇవాళ జరిగిన కేబినెట్ రాష్ట్ర ఆర్థిక పురోగతికి, ఏఐ అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఎస్‌ఐపీబీ మీటింగ్‌లో చర్చించిన నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి స్పష్టం చేశారు. వివిధ పాలసీలకు అనుగుణంగా ప్రోత్సాహకాలు ఇచ్చి రూ.1.17లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సుమారు 70 వేల ఉద్యోగాలు వచ్చేలా కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. అలాగే టాటా పవర్ రెన్యూవబుల్ లిమిటెడ్ ప్లాంటు, చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తోటపల్లి బ్యారేజి నుంచి 24 ఎంసీఎం నీటి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. శ్రీశైలం ఆలయం అభివృద్ధికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

రిలయన్స్ కన్సూమర్ ప్రాడక్ట్‌‌ల కింద కర్నూలు జిల్లాలో రూ.758 కోట్లతో ప్యాక్టరీ నెలకొల్పడానికి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. టూరిజం పాలసీ ఒక గేమ్ ఛేంజర్ .. అందుకే దానిపై కేబినెట్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చారు. దానికోసం ప్రత్యేకమైన ల్యాండ్ పార్సిల్స్ ఏర్పాటు చేయలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు ఒక డెస్టినేషన్ ఉండేలా కేబినెట్ భేటీ జరిగిందన్నారు. విశాఖ లోని మూడు ప్రాంతాలలో అతి పెద్ద డేటా సెంటర్స్ కి సంబంధించి భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా భవిష్యత్తులో మరికొన్ని డేటా సెంటర్స్ వచ్చే అవకాశం ఉండనుందని పేర్కొన్నారు. మంత్రులు తమ పని తీరు మెరుగు పర్చుకోవాలని.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos