ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ విజయవాడ నుంచి తెనాలికి ఆర్టీసీ బస్సులో వెళ్లారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో తెనాలి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కిన షర్మిల.. మధ్యలో ప్రయాణికులతో పిచ్చాపాటీ మాట్లాడుతూ... వారి కష్టాల్ని అడిగి తెలుసుకున్నారు. షర్మిల తమ బస్సు ఎక్కడంతో వారు కూడా ఆశ్చర్యపోయారు. కాసేపటి తర్వాత ఆమెకు తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

 కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు కాకపోవడంపై వారు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. హామీ అమలు కోసం వారు ఎదురుచూస్తున్నట్లు ఆమెకు చెప్పారు. దీంతో ఉచిత బస్సు ప్రయాణం హామీ కోసం గట్టిగా అడగాలని షర్మిల మహిళా ప్రయాణికులకు సూచించారు. అలాగే ప్రభుత్వాన్ని కూడా వెంటనే ఈ హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా పాలసీల పేరుతో టైంపాస్ చేస్తున్నారంటూ షర్మిల నిన్న ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా ఇవాళ నేరుగా మహిళా ప్రయాణికుల వద్దకే వెళ్లి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకూ షర్మిల పోరాటం కొనసాగించేందుకు సిద్దమైనట్లు అర్థమవుతోంది.

చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైపోయిందని, ఇప్పటివరకూ ఉచిత బస్సు పథకం అమలు చేయలేదని షర్మిల ఆరోపించారు. తాను ప్రయాణిస్తున్న బస్సులో ఉన్న మహిళలు చంద్రబాబు ఉచిత బస్సు ఏమైందని అడుగుతున్నారని తెలిపారు. తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే ఉచిత బస్సు అమలు చేశారని, కానీ ఏపీలో మాత్రం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లో 20 లక్షల మంది మహిళలే ఉన్నారని, దీంతో నెలకు 300 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం విషయంలో మహిళలపై మీకున్న చిత్తశుద్ధి ఇదేనా అని షర్మిల ప్రభుత్వాన్ని నిలదీశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos