అధికార టీడీపీ కూటమి అయినా.. విపక్ష వైసీపీ అయినా ఒకే రీతిలో స్పందిస్తుంటారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. సమకాలీన అంశాలలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూనే.. పాత వైసీపీ హయాంలో ఎలా జరిగిందో వాటికి ముడి పెడుతుంటారు. ఒకే అంశం మీద రెండు పార్టీలకు చురకలు అంటిస్తుంటారు. ఈ క్రమంలోనే ఏపీలో నూతన మద్యం పాలసీపై వైఎస్ షర్మిల రియాక్టయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా 3396 లిక్కర్ షాపుల లైసెన్సుల కోసం  సోమవారం లాటరీలు తీశారు. డ్రాలో గెలుపొందిన వారికి రేపటిలోగా మద్యం షాపులు అందజేస్తారు. ఇక 16 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే మద్యం దుకాణాల లాటరీ, లైసెన్సుల తీరును వైఎస్ షర్మిల విమర్శించారు. దీనిపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

" ప్రభుత్వ పనుల్లో రాజకీయ జోక్యం వద్దని చెప్పిన చంద్రబాబు గారు... మద్యం సిండికేట్లను అరికట్టడంలో రాజకీయ చోద్యం చూస్తున్నారు కదా. ఎక్కడికక్కడ అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై సిండికేట్లుగా ఏర్పడి మద్యం షాపులను దక్కించుకున్నారని తెలిసింది. కూటమి సిండికేట్లకే 3 వేలకు పైగా మెజారిటీ షాపులు దక్కాయంటే మీ పారదర్శకత, నిస్పాక్షికత ఎంత గొప్పగా ఉందో అర్థం అవుతుంది. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కనుసన్నల్లోనే టెండర్ల ప్రక్రియ సాగింది. సాధారణ ప్రజలకు షాపులు దక్కకుండా రాష్ట్రవ్యాప్తంగా బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రాణాలు పోతాయని హెచ్చరికలు చేశారు. కూటమి నేతలకు కాదని పొరపాటున ఎవరినైనా లాటరీ దక్కితే, లైసెన్స్ ఇస్తారా ? లేక 30 శాతం కమీషన్ ఇస్తారా ? లేకుంటే చస్తారా ? అంటూ బెదిరించారు. మమ్మల్ని కాదని మద్యం ఎలా అమ్ముతారో చూస్తాం అంటూ బహిరంగంగానే సవాళ్లకు పాల్పడ్డారు. సీఎం గారు! ఏసీ రూముల్లో కూర్చుని హెచ్చరికలు జారీ చేస్తే సరిపోతుందా? చర్యలు ఏవి?" అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

గత వైసీపీ పాలనలో మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు లేకుండా.. కేవలం నగదు చెల్లింపులు మాత్రమే జరిపారన్న వైఎస్ షర్మిల.. ఆ రకంగా అప్పటి ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఓన్లీ క్యాష్ అని గుడిని మింగేస్తే.. ఇప్పుడు మీరు గుడిలోని లింగాన్ని మింగేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రైవేటు పేరుతో తక్కువ ధర అని చెప్పి, మద్యం ఏరులై పారించి, వేల కోట్లు దోపిడీకి కూటమి సర్కార్ తెరలేపిందని వైఎస్ షర్మిల ఆరోపించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos