ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. అయితే ఈ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని.. ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామనే కారణంతోనే ఇలా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తప్పుబట్టారు. జనం ఓట్లేసి గెలిపించింది.. ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి కానీ.. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో సభకు వెళ్లకుండా ఉండేందుకు కాదంటూ షర్మిల ట్వీట్ చేశారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుందని విమర్శించారు, అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది ? ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు.. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది ? మీ స్వయంకృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే... ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాననడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశం." అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

"కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. మహిళలపై దాడులు ఆగడం లేదు. ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. బెల్టు షాపుల దందాను అరికట్టలేదు. 5 నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం వైసీపీకి ప్రజలు ఇస్తే... ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం అనడం సిగ్గుచేటు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలనే ఇంగితం కూడా లేకపోవడం బాధాకరం." అంటూ షర్మిల మండిపడ్డారు.

"1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా.. కుంగిపోలేదు. మీ లాగా హోదా కావాలని మారాం చేయలేదు. 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడి... ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదు. హోదా లేకున్నా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గార్లు ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారని...  మోదీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారని ... దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారిందని" షర్మిల ట్వీట్‌లో పేర్కొన్నారు.


వైసీపీ ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్లాలని.. కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని వైఎస్ షర్మిల సూచించారు. అసెంబ్లీకి వెళ్లే దమ్మూ, ధైర్యం లేకుంటే వైసీపీ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేసి ఇంట్లో కాకుంటే.. ఇంకా ఎక్కడైనా కూర్చొని తాపీగా మాట్లాడుకోవాలంటూ షర్మిల సెటైర్లు వేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos