కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో పథకం ప్రకారం ఓట్ల చోరీ జరిగిందని, దీని వెనుక ప్రధాని మోదీ ఉన్నారని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఆధారాలతో మాట్లాడుతుంటే, ప్రధాని మోదీ బండారం బయటపడుతోందని గురువారం ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘం, బీజేపీకి కీలుబొమ్మగా మారిందని షర్మిల ఆరోపించారు. లక్షలాది మంది ఓటు హక్కును కాలరాస్తూ, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. "ప్రధాని మోదీ కోసం అవసరమైన చోట దొంగ ఓట్లు సృష్టించడం, కాంగ్రెస్‌కు అనుకూలమైన చోట ఓట్లు తొలగించడం ద్వారా ఈసీ తన స్వయంప్రతిపత్తిని కోల్పోయింది" అని ఆమె పేర్కొన్నారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుస్తుందనే ఉద్దేశంతోనే, నకిలీ లాగిన్ల ద్వారా సుమారు 6 వేల ఓట్లను తొలగించారని ఆమె ఆరోపించారు.

సాఫ్ట్‌వేర్‌ను హైజాక్ చేసి, ఆటోమేటెడ్ ప్రోగ్రామింగ్ ద్వారా ఓట్లను తొలగించడం దేశద్రోహంతో సమానమని షర్మిల అభిప్రాయపడ్డారు. నకిలీ ధృవపత్రాలు, తప్పుడు ఫోన్ నంబర్లతో ఓట్లను అక్రమంగా తొలగించడాన్ని ఉగ్రవాద చర్యగా ఆమె అభివర్ణించారు. రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన విధంగా, తొలగించిన ఓటర్ల పూర్తి వివరాలను, వాటికి ఉపయోగించిన ఫోన్ నంబర్లు, ఓటీపీల సమాచారాన్ని వారం రోజుల్లోగా బహిర్గతం చేయాలని ఆమె ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న వారికి ఈసీనే స్వయంగా రక్షణ కల్పిస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని షర్మిల హెచ్చరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos