ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కాంపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ సిట్ అధికారులు తాజాగా ఈ కేసులో పురోగతి సాధిస్తున్నారు. అప్పట్లో మద్యం స్కాం డబ్బును దాచిన నిందితుల నుంచి ఆ డబ్బును చోరీ చేసిన వ్యవహారాన్ని ఛేదించడంతో పాటు నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల్ని జప్తు చేసేందుకు అనుమతి తీసుకున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ఈ కేసులో ఎనిమిది మంది నిందితులకు షాకిచ్చారు. మద్యం స్కాం కేసులో నిందితులుగా ఉంటూ విజయవాడ జిల్లా జైల్లో ఉన్న రాజ్ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, అనిల్ చోక్రా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, బూనేటి చాణక్య రిమాండ్ ముగియడంతో ఇవాళ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. అలాగే గుంటూరు జైలు నుంచి మరో ఇద్దరు నిందితులు నవీన్ కృష్ణ, బాలాజీ కుమార్ యాదవ్ ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దీంతో వీరి రిమాండ్ ను డిసెంబర్ 5 వరకూ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

గతంలో ఇదే కేసులో ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి వంటి వారు డిఫాల్ట్ బెయిల్ పొందారు. వీరిని మినహాయించి మిగిలిన నిందితులకు ఇప్పుడు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించడంతో వారు తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున రిమాండ్ పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏసీబీ కోర్టు వారికి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సిట్ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. దీంతో వారి రిమాండ్ పొడిగించలేదని తెలుస్తోంది. హైకోర్టు తీర్పు ఆధారంగా సిట్ వారి రిమాండ్ కోరనుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos