లిక్కర్ స్కాం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. లిక్కర్ స్కాం కేసులో మోహిత్ రెడ్డి ఏ39గా ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటివరకూ నలుగురికి బెయిల్ వచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలతో పాటు దిలీప్‌లకు బెయిల్ వచ్చింది. వారి బెయిల్స్ ను రద్దు చేయాలని సిట్ హైకోర్టును ఆశ్రయించింది. నిందితులకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేశారని, నిబంధనలకు అది విరుద్ధమని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో A-4గా ఉన్న రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఇటీవల సిట్ రెండు రోజుల కస్టడీకి తీసుకుంది. చార్జిషీటు దాఖలు చేయడం.. ఇక కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డిని సిట్ జులై 19, 2025న అరెస్ట్ చేసింది. A4గా FIRలో పేర్కొన్నారు. 2019-24 మధ్య వైసీపీ హయంలో రూ. 3,500 కోట్ల మేర లిక్కర్ స్కామ్ జరిగిందని సిట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. మిథున్ రెడ్డి లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలు, లంచాల సేకరణలో ముఖ్య పాత్ర పోషించారని సిట్ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. స్కామ్ మాస్టర్ మైండ్ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో మిథున్ రెడ్డి కలిసి పనిచేశారని సిట్ తెలిపింది.
లిక్కర్ స్కాంకు సంబంధించి PMLA, 2002 కింద హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్‌పూర్, ఢిల్లీ, ఏపీలోని ఇరవై ప్రదేశాలలో సెప్టెంబర్ 18న ఈడీ సోదాలు నిర్వహించింది. అక్రమ లావాదేవీల ద్వారా ముడుపుల చెల్లింపునకు దోహదపడిన సంస్థలు, సంబంధిత వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. లెక్కల్లో లేని రూ. 38 లక్షల నగదు, వివిధ నేరారోపణ పత్రాలు, డిజిటల్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని ఈడీ అధికారికంగా ప్రకటించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos