ఏపీలో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ చర్చగా మారుతోంది. మాజీ సీఎం జగన్ సతీమణి భారతి డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్స్‌కు గనుల శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థకు కడప జిల్లా ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో చట్టవిరుద్ధంగా కేటాయించిన సున్నపురాయి భూముల మైనింగ్‌ లీజులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నిర్దేశించింది. ఈ మేరకు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

భారతి సిమెంట్స్‌ కంపెనీ ప్రధాన కార్యాలయానికి పోస్టు ద్వారా నోటీసులు పంపించింది. నోటీసులు అందిన 15 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, అదానీ నియంత్రణలో ఉన్న అసోసియేటెడ్‌ సిమెంట్‌ కంపెనీస్ (ఏసీసీ)కు, రామ్‌కో సిమెంట్స్‌కు కూడా నోటీసులు వెళ్లాయి. 2023, 2024లలో అప్పటి జగన్‌ సర్కారు ఈ మూడు కంపెనీలకు వేర్వేరుగా సున్నపురాయి నిల్వలున్న భూములను కేంద్ర గనులు, ఖనిజాలు (అభివృద్ధి-నియంత్రణ) చట్టం-1957 (ఎంఎండీఆర్‌ యాక్ట్‌) నిబంధనలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా.. వేలంలో కాకుండా లీజులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, భారతి సిమెంట్స్‌కు ఇచ్చిన లీజులు ఎంఎండీఆర్‌ యాక్ట్‌ను ఉల్లంఘించడంతో పాటుగా 2023 సెప్టెంబరులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చి ఆదేశాలను ఉల్లంఘించి, న్యాయసలహా పేరిట భారీ డ్రామా నడిపి లీజులను నిర్ధారిస్తూ, కాలపరిమితిని 50 ఏళ్లుగా ప్రకటించారు.

ఈ మూడు లీజులపై 2024లోనే కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లగా విచారణ జరపాలని ఆదేశించింది. కొత్తగా కేటాయించే లీజులు వేలం ద్వారానే జరగాలని 2021లో మరో సవరణ జరిగినా.. వీటిని ఉల్లంఘించి భారతి సిమెంట్స్‌కు లీజుల కేటాయింపు జరిగింది. కాగా, లీజులు ఎందుకు రద్దుచేయకూడదో వివరణ ఇవ్వాలని 2016 డిసెంబరు 30న భారతి సిమెంట్స్‌కు నోటీసులు ఇచ్చింది. ఆ కంపెనీ స్పందించక పోవడంతో 2017 జనవరి 10న లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్ (ఎల్‌ఓఐ)ని రద్దుచేసింది. అయితే, జగన్ సీఎంగా ఉన్న సమయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారతి సిమెంట్స్‌కు ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో అత్యంత విలువైన సున్నపురాయి నిల్వలున్న 744 ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు. మైనింగ్‌ లీజును ఏకంగా 50 ఏళ్లకు పొడిగించారు. ఇక.. తాజా నోటీసుల పైన భారతీ సిమెంట్స్ స్పందన ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos