దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు వర్మ. సోమవారం హైకోర్టులో పిటిషన్ పై విచారణ జరిగింది. పిటిషనర్‌ కు  అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ లాయర్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించగా.. పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారని ఆర్జీవీ తరఫున లాయర్ కోర్టుకు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై వివాదం నడిచింది. వర్మ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా వరుసగా సోషల్ మీడియాలో వర్మ పోస్టులు చేశారు. దీనిపై అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ఆర్జీవీపై టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. దీంతో వర్మపై వరుసగా కేసులు నమోదయ్యాయి.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై పోస్టులకు సంబంధించి.. రామ్‌గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు చేశారు. మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. హైదరాబాద్‌ వెళ్లి మరీ ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరుకావాలని సూచించారు.. దీంతో ఈ కేసులో తనను అరెస్ట్ చేస్తారని భావించిన ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు.. అరెస్ట్ చేస్తారని భయం ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది

ఈ కేసుకు సంబంధించి మంగళవారం విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో.. ఆయన విచారణకు హాజరవుతారా..? లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ వర్మ విచారణకు హాజరుకాకుంటే నేరుగా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆర్జీవీ న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఏదైనా పోలీసులతోనే తేల్చుకోవాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos