వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని, టీటీడీ నిర్లక్ష్యంగా ఉండడం వల్ల మూడు నెలల్లో వంద గోవులు మృతి చెందాయని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో టీటీడీ బోర్డు భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ తరహా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్వి గోశాలలో గోవులు మృతి చెందాయన్న అసత్య ప్రచారాలపై టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. భూమన పై చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.
ఎస్వి గోశాలలో వంద గోవులు మృతి చెందాయని పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి పైన ఐటీ యాక్ట్ , బి ఎన్ ఎస్ యాక్ట్ ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయని, ఆ విషయాన్ని తాము ఆధారాలతో సహా బయట పెట్టామని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గోవులకు పురుగులు పట్టిన ఆహారాన్ని పెట్టారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. గతంలో భూమన హయాంలో టీటీడీ లో జరిగిన అక్రమాల పైన విచారణ సాగుతుందని భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలు అన్నింటిని వెలికి తీస్తున్నామని టీటీడీ బోర్డు త్వరలోనే అన్నిటి పైన చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి మాత్రమే కాదు టీటీడీలో అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరి అవినీతిని బయటకు తీస్తామని ఆయన తేల్చి చెప్పారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos