ఏపీలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం టూర్ ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. పిఠాపురంలో గతంలో పల్లెపండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ శంఖుస్థాపన చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించేందుకు వెళ్లిన నాగబాబును టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ అభిమానులు అడుగడుగునా చికాకు పెడుతున్నారు. దీంతో ఆయనకు వరుస షాకులు తప్పడం లేదు. ఇటీవల పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో వర్మను ఉద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహంగా ఉన్న ఆయన అభిమానులు ఇప్పుడు ఆయన టూర్ లో ఆ కోపం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాగబాబు ప్రారంభోత్సవాలు చేస్తున్న కార్యక్రమాలకు వెళ్తున్న వర్మ అభిమానులు.. అక్కడ ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. దీంతో జనసేన అభిమానులు కూడా ప్రతినినాదాలు చేస్తున్నారు.

ఇవాళ రెండోరోజు పిఠాపురం పర్యటనలో భాగంగా నాగబాబు పిఠాపురం మండలం కుమారపురం హౌసింగ్ లే అవుట్ -1లో 15.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనూ జనసేనతో పాటు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నాగబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే వర్మకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ జోక్యం చేసుకుని అభిమానుల్ని సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు. దీంతో ఉద్రిక్తతల మధ్యే నాగబాబు పిఠాపురం టూర్ కొనసాగుతోంది.

గత ఎన్నికలకు ముందు పిఠాపురంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వర్మను చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు పోటీ నుంచి తప్పించారు. అదే సమయంలో ఆయనకు ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో గెలిచాక మాత్రం పవన్ సూచన మేరకు ఎమ్మెల్సీ సీటు హామీ మర్చిపోవడంతో పాటు ఆయన్ను దూరం పెడుతున్నారని అభిమానులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు వర్మపై చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత రాజేశాయి. ఇప్పుడు నాగబాబు టూర్ పై వీటి ప్రభావం కనిపిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos