ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. లడ్డూ వివాదంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్ విచారణ వేళ ఏపీ ప్రభుత్వం ఈ అంశం పైన ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుబ్రమణ్య స్వామి సుప్రీంను ఆశ్రయించారు. దీని పైన విచారించిన సుప్రీంకోర్టు ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని.. అటు సిట్.. ఇటు ఈ కమిటీ చట్టానికి లోబడి విచారణ చేయాలని నిర్దేశించింది. ఈ రోజున అసెంబ్లీ లో లడ్డూ పైన లఘు చర్చ ప్రారంభమైంది. ఇదిలా ఉండగా.. జగన్ హయాంలో తీసుకున్న మరో వివాదాస్పద నిర్ణయాన్ని రద్దు చేస్తూ అధికారిక నిర్ణయానికి కేబినెట్ సిద్దమైంది.

ఈ రోజు అసెంబ్లీలో లడ్డూ వివాదం మొదలు నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు... విచారణ ఏజెన్సీలు తేల్చిన అంశాల పైన సభలో చర్చ ప్రారంభమైంది. చర్చ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో టీటీడీలో అన్యమతస్థులకు ఎంట్రీ.. నిబంధనలను కఠినతరం చేయాలని డిసైడ్ అయ్యారు. కాగా.. ఈ రోజు మధ్యాహ్నం జరిగే కేబినెట్ సమావేశం కీలకంగా మారుతోంది. సీఆర్డీఏ చేసిన ప్రతిపాదనలు.. ఎస్ఐబీపీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. కాగా.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో ఆర్-5 జోన్ లో విజయవాడ, గుంటూరుకు చెందిన దాదాపు 50 వేల మందికి కేటాయించిన నివాస స్థలాలను తిరిగి రెవిన్యూ నుంచి సీఆర్డీఏ స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. స్థలాలు పొందిన వారికి కూటమి ప్రభుత్వ విధానం మేరకు వారి ప్రాంతాల్లోనే తిరిగి ఇంటి స్థలాలు కేటాయించనున్నారు. ఈ క్రమంలో.. అమరావతిలో జగన్ ప్రభుత్వం కేటాయించిన భూములను తిరిగి రెవిన్యూ శాఖ నుంచి స్వాధీనం చేసుకునేందుకు ముందుగా నోటీసులు జారీ చేయనున్నారు.

ఆర్ 5 జోన్ లో గత ప్రభుత్వంలో పేదలకు కేటాయించిన భూములను రద్దు చేసి మరొక ప్రాంతంలో కేటాయింపు పైన చర్చించి ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. జగన్ ప్రభుత్వం కేటాయించిన 1402.58 ఎకరాల భూమిని తిరిగి CRDA కి అప్పగిస్తూ ఈ భేటీలో నిర్ణయించనున్నారు. గత ప్రభుత్వం R-5 జోన్ లో వేసిన లే-ఔట్లు.. భూపంపిణీని రద్దు చేసిన CRD అథారిటీ నిర్ణయానికి ఆమోద ముద్ర పడనుంది. క్యాబినెట్ భేటీ తరువాత తాజా రాజకీయ పరిణామాల పై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా తిరుమల లడ్డూ వివాదం.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. భవిష్యత్ కార్యాచరణ పైన మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos