ఏపీలో ఒంటి పూట బడుల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేసవి కాలం ఒంటి పూట బడులపై వినతులు వస్తున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో ఎండల తీవ్రత పెరుగనున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమైంది.

మార్చి 15వ తేదీ నుండి ఒంటి పూట బడులను ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సుమారు 37 డిగ్రీలకు పైగా నమోదవుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాల స్థాయి విద్యార్థులకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో ఎండలు అధికం కావడంతో సామాన్య ప్రజానీకం పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎండల ధాటికి రోజు వారీ కూలీ పనులకు వెళ్లే కూలీలు, తోపుడుబండ్ల వ్యాపారులు పడుతున్న అవస్థలు ఎక్కువే. అలాగే ఉపాధి హామీ కూలీలు సైతం ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. కూలీలకు సమ్మర్ సీజన్ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. త్వరలోనే ఉపాధి కూలీలు పని చేసే ప్రాంతాలలో టెంట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తదితర సామాగ్రితో పాటు మజ్జిగను సైతం అందిస్తారని తెలుస్తోంది.

అయితే పెరుగుతున్న ఎండల ధాటికి విద్యార్థులు గత కొద్దిరోజులుగా ఒంటి పూట బడులపై ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే మొత్తం మీద ప్రభుత్వం మార్చి నెల 15 వ తేదీ నుండి ఒంటి పూట బడులను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమైందని సమాచారం. అలాగే ఏపీలో మార్చి 17 నుండి పదవ తరగతి పరీక్షలు  ప్రారంభం కానుండటంతో విద్యార్థులు బిజీ బిజీగా చదువులో నిమగ్నమయ్యారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos