తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి ఆరోపణలపై సిట్ విచారణ కీలక దశకు చేరుకుంది. సిట్ ఇప్పటికే నెయ్యి తయారీ కేంద్రాల నుంచి సరఫరా సంస్థల వరకు ప్రాధమిక సమాచారం సేకరణ చేసింది. నెయ్యి సరఫరా చేసిన సంస్థల్లోనూ విచారణ మొదలు పెట్టింది. ఆ సంస్థల్లో కీలక ఫైల్స్ ను స్వాధీనం చేసుకుంది. నెయ్యి ట్యాంకర్ల రవాణా లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. సీసీ టీవీ కెమేరా ఫుటేజ్ ద్వారా సిట్ కీలక ఆధారాలను సేకరించింది. దీంతో, సిట్ విచారణ లో రానున్న రోజుల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

శ్రీవారి లడ్డూ తయారీకి కావాల్సిన నెయ్యి సరఫరాకు ఒప్పందం చేసుకున్న సంస్థల్లో సిట్ విచారణ చేసింది. ఆ సంస్థల ఫైల్స్ ను స్వాధీనం చేసుకుంది. నెయ్యి సరఫరా కోసం టీటీడీతో ఏఆర్ డెయిరీ సంస్థ ఒప్పందం చేసుకుంది. కానీ, ఒప్పందానికి విరుద్దంగా వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించి టీటీడీకి సరఫరా చేసినట్లు సిట్ అంచనాకు వచ్చింది. టీటీడీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏఆర్‌ డెయిరీనే టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలి. కానీ, ఏఆర్‌ డెయిరీ తన ట్యాంకర్లను వైష్ణవి డెయిరీకి పంపినట్లు తాజా విచారణలో ఆధారాలు చిక్కాయి. అక్కడ నెయ్యి నింపుకుని టీటీడీకి సరఫరా చేసినట్టు ఏఆర్‌ డెయిరీ నుంచి సేకరించిన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో, డ్రైవర్లను విచారించేందుకు సిట్ సిద్దం అవుతోంది.

నెయ్యి సరఫరా చేసిన ట్యాంకర్లు రాకపోకలు సాగించిన మార్గాల్లోని టోల్ గేట్ల వద్ద సీసీ కెమేరాల ఫుటేజ్ ఇప్పుడు కీలకంగా మారుతోంది. దీనిని సిట్ అధికారులు సేకరించారు. ఆ మార్గాల్లోని అన్ని చెక్ పోస్టుల వద్ద రికార్డులు పరిశీలించారు. ఆ ట్యాంకర్లకు జీపీఎస్ ఉందా లేదా అని ఆరా తీసారు. ట్యాంకర్ల నెంబర్లు..డ్రైవర్ల వివరాలను సిట్ సేకరించింది. ఏఆర్‌ డెయిరీ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి నాణ్యతను నిర్ధారిస్తూ సర్టిఫికెట్‌ జారీ చేసిన చెన్నైలోని ఎస్‌ఎంఎస్‌ ల్యాబ్‌ నిర్వాహకులను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. సిట్ విచారణ పురోగతి గురించి సీబీఐ డైరెక్టర్ సమీక్ష చేసారు. సిట్ అధికారులతో విచారణ ప్రక్రియ గురించి ఆరా తీసారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos