ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. మొన్నటి వరకు పట్టభద్రులు, టీచర్స్ ఎన్నికలు జరిగాయి. ఇందులో టీడీపీకి అడ్వాంటేజ్ జరిగింది. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. త్వరలోనే 5 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లెక్క ప్రకారం ఐదు సీట్లు కూడా కూటమి ప్రభుత్వం దక్కించుకునే ఛాన్సు ఉంది. వైసీపీకి సంఖ్యాబలం లేదు కాబట్టి కచ్చితంగా అన్నీ తెలుగుదేశం కూటమి దక్కించుకుంటుంది.
అయితే ఇందులో బీజేపీ పార్టీ జోక్యం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 5 ఎమ్మెల్సీ స్థానాలలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీకి కేటాయించాలని కోరుతున్నారని సమాచారం. బీజేపీకి సొంతంగా ఎమ్మెల్సీ దక్కించుకునేంత బలం లేదు. కాబట్టి కూటమి ఎమ్మెల్యేలందరూ కలిసి ఓటు వేయాలి. ఈ నేపథ్యంలోనే ఒక్క సీటు బీజేపీకి కేటాయించాలని అధిష్టానం కోరుతున్నట్లు సమాచారం. కేంద్రంలో కేంద్ర మంత్రి పదవులు అన్నీ టీడీపీకి ఇచ్చామని... ఇప్పుడు బీజేపీకి ఏపీలో పదవులు ఇవ్వాలని కొంతమంది కార్యకర్తలు అలాగే నేతలు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఈ తరుణంలోనే తెరపైకి సోము వీర్రాజు పేరు వచ్చినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల్లో... బీజేపీ తరఫున సోము వీర్రాజుకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా సోము వీర్రాజు పని చేశారు. అయితే ఆయనను పక్కన పెట్టి పురందరేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. అయితే ఇప్పుడు కచ్చితంగా... బీజేపీకి పనిచేస్తున్న సోము వీర్రాజుకు పదవి ఇవ్వాలని అంటున్నారు. ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించాలని కోరుతున్నారు కొంతమంది బీజేపీ నేతలు. దీనికి అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారని... అన్నీ ఓకే అయితే బీజేపీకి కూడా ఒక ఎమ్మెల్సీ సీటు వచ్చే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos