ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభం కాగా... తొలి రోజు గవర్నర్ ప్రసంగం పూర్తి చేసి సమావేశాల్ని ఇవాళ్టికి వాయిదా వేశారు. ఇవాళ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. అయితే నిన్న సభలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యుల వ్యవహారశైలిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న అసెంబ్లీ, మండలి సంయుక్త భేటీలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు జగన్ సూచన మేరకు వైసీపీ సభ్యులు నిలబడి నిరసనకు దిగారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ గవర్నర్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన ప్రసంగం కొనసాగించారు. దీంతో 11 నిమిషాల పాటు వేచిచూసిన జగన్, వైసీపీ సభ్యులు సభను బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. దీనిపై ఇవాళ స్పందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత మరిచి ప్రవర్తించారంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు తమ సభ్యుల్ని నియంత్రించాల్సింది పోయి సీట్లో జగన్ నవ్వుకుంటూ కూర్చొన్నారని స్పీకర్ అయ్యన్న ఫైర్ అయ్యారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేదని, ఇకపైనా జగన్ విజ్ఞతతో వ్యవహరించాలని స్పీకర్ సూచించారు. మరోవైపు ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇవ్వకుండా కోట్లు వృథా చేశారంటూ సాక్షి పత్రికలో వచ్చిన ఓ వార్తపై నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య ఫిర్యాదు చేశారు. సాక్షి మీడియాపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే డిమాండ్ పై స్పందించిన స్పీకర్ సభా హక్కుల నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos