రాష్ట్ర పాలనలో వేగాన్ని పెంచి, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ అనే సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ తరహాలోనే ఈ విధానం ఉంటుందని, ప్రభుత్వ పాలనకు జిల్లా కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో ఇవాళ‌ బుధవారం జరిగిన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారుల పనితీరుకు ఇకపై ఇదే కొలమానం అవుతుందని తెలిపారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను (గ్రీవెన్సులు) త్వరితగతిన పరిష్కరించి, ఆ వివరాలను పారదర్శకంగా ఆన్‌లైన్‌లో ఉంచాలని ఆదేశించారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి స్థాయిని పెంచాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని సీఎం అన్నారు. ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, యువత వంటి అన్నివర్గాలకు మేలు చేయడం ద్వారా ప్రభుత్వానికి సానుకూలత వస్తుందన్నారు. పాలనలో ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని, వారి సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ఒక జిల్లాలో అమలవుతున్న ఉత్తమ విధానాలను (బెస్ట్ ప్రాక్టీసెస్) ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన పది సూత్రాలను పటిష్టంగా అమలు చేసి 15 శాతం వృద్ధి రేటు సాధనలో భాగస్వాములు కావాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos