విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు.  ఆయన యుగపురుషుడు, తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు అని కొనియాడారు. సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే 3 ప్రాథమిక అవసరాలను తీర్చడమే తన జీవితాశయంగా భావించిన వ్యక్తి అని కొనియాడారు. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పారు. అన్నగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చారు, మండల వ్యవస్థతో పాలనారంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లారు. పక్కా ఇళ్ల నిర్మాణంతో పేదలకు అండగా నిలిచి, కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని అందించి పేదల ఆకలి తీర్చిన నేత ఎన్టీఆర్.  తెలుగు జాతి గౌరవంగా తలెత్తుకు నిలబడాలనే సంకల్పంతోనే ఆయన ఇవన్నీ చేశారు.

చరిత్రలో స్థానం సంపాదించుకోవడం కాదు… చరిత్రనే సృష్టించిన చిరస్మరణీయుడు ఎన్టీఆర్. నేటికీ తెలుగుదేశం ఉజ్వలంగా ప్రకాశిస్తున్నదంటే అది ఎన్టీఆర్ ఇచ్చిన ఆశీర్వాదబలమే. ఆ మహానేత సంకల్పాన్ని నెరవేర్చేందుకు అహర్నిశలూ కష్టపడుతుంటాం. సమసమాజాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నాం. అనితరసాధ్యమైన ఎన్నో పనులు చేసిన అన్న ఎన్టీఆర్‌కు ఘన నివాళి అర్పిస్తున్నాను’ అని చంద్రబాబు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

తెలుగువారి ఆత్మగౌరవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఒక సామాన్య వ్యక్తిగా ప్రారంభమైన  ఆయన ప్రయాణం ఒక మహాశక్తిగా మారింది. సినీ నటుడిగా ఉన్నప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే జోలె పట్టి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ప్రజా నాయకుడిగా పేద ప్రజల ఆకలి తీర్చి సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిన నేత ఆయన. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్ళు అనే నినాదాన్ని నిత్య శ్వాసగా చేసుకొని ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ప్రతి అడుగు నేటి తరానికి మార్గదర్శి. ఆ మహనీయుని జయంతి సందర్భంగా  నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది మే 28న రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం నాడు ఏపీ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు సైతం జారీ చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు టీడీపీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని నివాళి అర్పిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos