తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు కూడా శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. మార్చి 24 నుంచి ఈ విధానం అమలు చేయనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇక ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలను వారంలో రెండు రోజులు మాత్రమే అనుమతిస్తారు. ఒక్కో ప్రజాప్రతినిధి రోజుకు ఒక్క లేఖ జారీ చేయడానికి అవకాశం ఇస్తారు.  ఆ లేఖపై ఆరుగురు దర్శనం చేసుకోవచ్చు. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఆది, సోమవారాల్లో మాత్రమే తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరిస్తారు. వీరికి సోమ, మంగళవారం మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. అలాగే రూ. 300 దర్శనం టికెట్లకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను బుధ, గురువారాలల్లో మాత్రమే టీటీడీ స్వీకరించనుంది. వీరికి ఏ రోజుకారోజు దర్శనం కల్పిస్తారు. ఇక ఒకరికి రోజుకు ఒక సిఫార్సు లేఖను మాత్రమే అనుమతిస్తారు. అలాగే ఆరుమందికి మించకుండా స్వీకరించడం జరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos