ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తోంది. ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల నేపథ్యంలో జనసేన అధిష్ఠానం కఠిన నిర్ణయం తీసుకుంది. పార్టీ విలువలకు కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో, ఈ వ్యవహారంపై నిజానిజాలను నిగ్గుతేల్చడానికి పార్టీ రంగంలోకి దిగింది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అరవ  శ్రీధర్ ఏడాదిన్నరగా తనను బెదిరిస్తూ, అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఓ మహిళా ఉద్యోగి ఆరోపిస్తున్నారు. ఈ ఏడాదిన్నరలో తనను ఐదుసార్లు గర్భవతిని చేశారని.. అబార్షన్‌ కూడా చేయించారని బయటపెట్టింది. ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ మహిళా ఉద్యోగికి ఇదివరకే పెళ్లయింది. మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఉద్యోగ రీత్యా భర్త హైదరాబాద్‌లో ఉంటున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని బలవంతం చేయడమే కాకుండా.. అందుకు ఒప్పుకోకపోవడంతో తన భర్తకు ఫోన్‌ చేసి బెదిరించాడని బాధితురాలు వాపోయింది. ఐటీ ఉద్యోగం చేస్తున్న తన భర్తకు విడాకులు ఇవ్వాలని హుకుం జారీ చేశారని దాంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయని చెబుతుంది. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని చెప్పింది చేయాల్సిందేనని పట్టుబట్టాడని.. లేదంటే తన మూడేళ్ల బిడ్డ ప్రాణం తీస్తానని హెచ్చరించారని కన్నీటి పర్యంతం అయ్యింది. ఇలా ఏడాదిన్నర కాలంగా సదరు జనసేన ఎమ్మెల్యే ఆగడాలు భరాయిస్తూ రాగా.. ఇప్పుడు తట్టుకోలేక వీడియోలు, వాట్సాప్‌ చాట్‌లతో సహా బయట పెట్టడం కలకలం రేపుతోంది.

ఈ పరిణామాలపై స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారాన్ని తేల్చడానికి పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన ఒక అంతర్గత విచారణ కమిటీని నియమించింది. టి. శివశంకర్, తంబళ్ళపల్లి రమాదేవి, టీసీ వరుణ్ తో ఏర్పాటు చేసిన కమిటీ ముందుకు.. అరవ శ్రీధర్ 7 రోజుల్లోగా హాజరై తన వివరణను సమర్పించాల్సి ఉంటుంది. విచారణ నివేదిక వచ్చే వరకు, తుది నిర్ణయం వెలువడే వరకు అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ స్పష్టంగా ఆదేశించింది. మరోవైపు, ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ కూడా బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించింది. అయితే, ఎమ్మెల్యే తల్లి ప్రమీల ఈ ఆరోపణలను ఖండించారు. తన కుమారుడిని అభాసుపాలు చేసేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని, ఆ మహిళే తన కుమారుడిని బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆమె ప్రత్యారోపణలు చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos