విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. విశాఖపట్నం స్టీల్ ప్టాంట్‌కు రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. గురువారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. గురువారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్వర్యంలో జరిగిన కేంద్ర ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిలతో చర్చలు జరుపుతూ వచ్చారు. ఇటీవల ఏపీలో ప్రధాని పర్యటన సందర్భంగానూ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించి.. ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీలో ఆర్దిక ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ గత రెండేళ్లుగా కార్మికులు, ఉద్యోగ సంఘాలు ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

ఏటా 7.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ గత కొన్నేళ్ల నుంచి నష్టాలను ఎదుర్కొంటోంది. 2023-24లో రూ.4,848.86 కోట్లు, అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో రూ.2,858.74 కోట్ల నష్టాలను చవిచూసింది. వర్కింగ్ క్యాపిటల్‌ కోసం చేసిన అప్పులు పెరగడం దీనికి ప్రధాన కారణం.  ఏటా 7.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ గత కొన్నేళ్ల నుంచి నష్టాలను ఎదుర్కొంటోంది. 2023-24లో రూ.4,848.86 కోట్లు, అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో రూ.2,858.74 కోట్ల నష్టాలను చవిచూసింది. వర్కింగ్ క్యాపిటల్‌ కోసం చేసిన అప్పులు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో స్టీల్‌ ప్లాంట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos