రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం వెనుక ప్రత్యేక యుహమే ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సాధారణంగా అమిత్ షా ఆదివారం పూట అధికారిక సమావేశాల్లో పాల్గొనరు. అంటే నారా లోకేష్‌తో భేటీ పూర్తిగా రాజకీయమే అనుకోవచ్చు. దాదాపుగా నలభై నిమిషాల పాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. లోకేష్ క్యాంప్ మాత్రం… కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో చేపట్టిన అనేక కార్యక్రమాలను అమిత్ షా కు నారా లోకేష్ వివరించారని.. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారని చెబుతోంది. సమస్యలు అధిగమించి రాష్ట్రం బలమైన శక్తి గా ఎదిగేందుకు కేంద్ర సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారని అంటోంది. కానీ నారా లోకేష్ ప్రత్యేక ఎజెండాతోనే అమిత్ షాను కలిశారని భావిస్తున్నారు.

రాష్ట్రంలో రెడ్ బుక్ అమలును లోకేష్ బాధ్యతగా తీసుకున్నారు. అయితే అన్నీ చట్టబద్దంగానే తీసుకోవాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి దూకుడుగా ఎలాంటి చర్యలు తీసుకోలేరు. బీజేపీతో సంప్రదింపులు జరపాల్సిందే. రాష్ట్ర బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో కీలకమయ్యే విషయాల్లో వారితో మాత్రమే మాట్లాడాల్సి ఉంది. అందుకే లోకేష్ ఇటీవలి కాలంలో తరచూ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే నారా లోకేష్ ఢిల్లీకి తీసుకెళ్తున్న అజండా ఏమిటనేది ఆయన సన్నిహితులకు కూడా తెలియదు.

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన గ్యాంగ్ చేసిన నేరాలు, ఘోరాలపై ప్రతి ఆధారాన్ని సేకరించి సంపూర్ణమైన నివేదికలను ఆయన కేంద్రానికి సమర్పిస్తున్నారని వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో కూడా ముందుగా సంకేతాలు ఇస్తున్నారని అంటున్నారు. తద్వారా దూకుడుగా… తొందరపాటుగా నిర్ణయాలు తీసుకున్నారన్న భావన రాకుండా చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నారా లోకేష్ ఏది చేసినా ప్రణాళికాబద్దంగా చేస్తారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అదే వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకండా చేస్తోంది. మొత్తానికి లోకేష్ కేంద్రమంత్రి అమిత్ షా తో భేటీ తర్వాత రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉంటాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos