విశాఖలోని ఆంధ్ర యూనివర్శిటీలో దురదృష్టకరమైన ఘటన జరిగింది. మణికంఠ అనే విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందాడు. దీనిపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు వైద్య సౌకర్యాలు లేవంటూ వీసీ కార్యాలయాన్ని ముట్టడించాయి. దీనిపై మంత్రి నారా లోకేష్‌ అసెంబ్లీలో స్పందించారు. క్యాంపస్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి సిద్దమని కానీ రాజకీయాలు చేయొద్దని సూచించారు. అలా చేస్తామంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆంధ్ర యూనివర్శిటీలో వైద్య సదుపాయాలు సరిగా లేవని అందుకే ఈ ఘటన జరిగిందని విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. దీనిపై లిఖిత పూర్వక హామీ ఇస్తే తప్ప వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ఈ ఉదయం వీసీ ఛాంబర్‌ను ముట్టడించిన విద్యార్థులు అక్కడే బైఠాయించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేల మంది విద్యార్థులు ఉండే ఏయూలో కేవలం ఒకటే డిస్పెన్సరీ ఉందని అందులో కూడా సదుపాయాలు లేవన్నారు. ఎవరు ఏ అనారోగ్య సమస్యతో వెళ్లినా డోలో మాత్రమే ఇస్తున్నారని అంతకు మించిన మందులు కూడా లేవన్నారు. సరైన సదుపాయాలు ఉండి ఉంటే మణికంఠ బతికి ఉండేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయంలో ఆక్సిజన్, మందులు, అంబులెన్స్ లేకపోవడంతోనే తోటి విద్యార్థి చనిపోయాడని అన్నారు. దీనిపై వీసి, ప్రభుత్వం తమకు స్పష్టమైన లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

విద్యార్థుల ఆందోళనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ అసెంబ్లీలో మాట్లాడారు. అనారోగ్యంతో విద్యార్థి చనిపోయినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఘటన గురించి తెలిసి బాధపడ్డామని పేర్కొన్నారు. దీనికి కారణమేంటీ, యూనివర్శిటిలో ఉన్న సమస్యలు ఏంటనే తదితర అన్ని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమని స్పష్టం చేశారు. అంతే కానీ విషయాన్ని రాజకీయం చేయొద్దని విద్యార్థులకు సూచించారు. వచ్చి ప్రభుత్వంతో మాట్లాడితే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రోడ్లపై కూర్చొని, కార్యకలాపాలకు, తరగతులకు ఆటంకం కలిగిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. విద్యాలయాల్లో రాజకీయాలు చేయొద్దని సూచించారు. ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారిపై కఠినంగా ఉంటామని హెచ్చరించారు. 

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos