విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి భవానిపురంలో సుజన మిత్ర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసి.. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే వ్యవస్థను రూపొందించారు.. సుజనా మిత్ర లకు ఇచ్చిన ఎలక్ట్రిక్ బైకులను ఎమ్మెల్యే సుజనా.. కూటమినేతలతో కలిసి  మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. సుజన చౌదరి తనకు మంచి స్నేహితుడని  ఇద్దరం కలిసి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశామన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనాకి అపారమైన అనుభవం ఉందని, ప్రజాసేవకే ఆయన నిత్యం తపిస్తారని చెప్పారు. 2014-19 మధ్య పురపాలక శాఖకు బడ్జెట్ ఉండేదన్న మంత్రి నారాయణ ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న లోన్లు అప్పులు కట్టడానికి బడ్జెట్ సరిపోతుందన్నారు. 2019 లో ఏఐఐబి నుంచి 5380 కోట్ల నిధులు తీసుకొచ్చామని, కానీ గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల ఆ నిధుల విడుదల నిలిచిపోయిందనీ గుర్తుచేశారు. గత ప్రభుత్వం నిధులు ఇచ్చి ఉంటే ప్రతి ఇంటికి మనిషికి 135లీటర్ల నీరందించే అవకాశం కలిగి ఉండేదన్నారు. మళ్ళీ సీఎం చంద్రబాబు చొరవతో నిధులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.


విజయవాడ పశ్చిమ అభివృద్ధికి తన వంతు సహకారం పూర్తిగా అందిస్తానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సుజనా మిత్ర ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ప్రజా ప్రతినిధులు కులమతాలకతీతంగా నిస్వార్ధంగా ప్రజాసేవచేసి పదవులకు వన్నె తేవాలని పిలుపు నిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని, అందరి సమన్వయం తో కలసికట్టుగా ముందుకు వెళ్దామని అన్నారు. తాను పేరుకు మాత్రమే ఎమ్మెల్యేనని ప్రజలకు మాత్రం సేవకుడిగా ఉంటానని, అవినీతిరహిత పాలన అందిస్తూ ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో చందాలు, దందా లకు తావు లేకుండా పాలన సాగిస్తున్నామన్నారు.

సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశ్చిమంలోని 22 డివిజన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టానన్నారు . అందులో భాగంగానే మొదటిగా మూడు  దశల్లో డెవలప్మెంట్ ఫోరం లను ఏర్పాటు చేశామన్నారు.. నియోజకవర్గం, జోన్, డివిజన్ ప్రాతిపదికగా ఈ ఫోరం లను ఏర్పాటు చేశానని వివరించారు.  ఫోరం లకు, ప్రజలకు అనుసంధానంగా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుజనా మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాలన్నారు.  అసాంఘిక శక్తులను ఉపేక్షించకుండా డ్రగ్స్, గంజాయి వంటి వాటి మీద ఉక్కు పాదం మోపాలన్నారు. పైరవీలకు స్వస్తి  పలుకుతూ రాజకీయాలకు కులమతాలకతీతంగా నియోజవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు.  వైసిపి ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసంతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. అభివృద్ధిలో వెనుకబడిన పశ్చిమ నియోజకవర్గాన్ని గాడిన పెట్టడానికి మేధ దానం, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు,  వైద్యులు, శ్రమదానం,చేసి  అభివృద్ధికి సహకరించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రజలందరి భాగస్వామ్యంతో  పశ్చిమాన్ని అభివృద్ధి   చేస్తానని సుజనా హామీ ఇచ్చారు. సుజనా ఫౌండేషన్ అడ్వైజర్ వేజెండ్ల శ్రీనివాస్ రావు డెవలప్మెంట్ ఫోరం లు, సుజనా మిత్ర ల వ్యవస్త పని చేసే తీరును పవర్ పాయింట్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా 22 మంది  సుజన మిత్ర లకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అంద చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos