ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డికి కూడా నోటీసులు పంపింది. వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అరెస్టు చేసిన నిందితులు జైలులో ఉన్నారు. వీరిని నిందితుల్లో ఒకరైన అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడైన మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి జైలుకు వెళ్లి అప్రూవర్ గా మారిన దస్తగిరిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటి ఆధారంగా అవినాష్ రెడ్డికి గతంలో మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ స్పందించి నోటీసులు పంపింది.

వైఎస్ అవినాష్ రెడ్డికి గతంలో బెయిల్ ఇచ్చిన సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. ఇందులో సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేయకూడదని, సాక్షుల్ని బెదిరించకూడదని కూడా సూచించారు. వీటిని అవినాష్ రెడ్డి సహా ఇతర నిందితులు ఉల్లంఘించారంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టులోని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచ్.. వీటిపై వివరణ ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డితో పాటు జైలుకు వెళ్లి నిందితుల్ని బెదిరించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్య రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ మార్చి 3కు వాయిదా వేసింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos