ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి. దేశీయ కంపెనీలు మాత్రమే కాకుండా.. విదేశాలకు చెందిన చాలా కంపెనీలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వివిధ సదస్సుల్లో ఏపీ మంత్రులు, ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రానికి వచ్చే కంపెనీలకు అన్ని రకాలుగా రాయితీలు, ప్రోత్సాహకాలు, సహకారం అందిస్తున్నారు. దీంతో ఏపీలో భారీ మొత్తంలో పెద్ద పెద్ద కంపెనీలతోపాటు చిన్న సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ.. తైవాన్‌కు చెందిన ఓ కంపెనీ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయి చర్చించింది.

ఈ క్రమంలోనే ఇండో-తైవాన్ ఇండస్ట్రియల్ పార్కును చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని.. తైవాన్ ప్రతినిధి బృందం ఆసక్తి చూపించింది. రూ.400 కోట్ల వ్యయంతో అలీజియన్స్ గ్రూప్.. ఈ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని వారు చంద్రబాబుకు వెల్లడించారు. ఈ సందర్భంగా తైవాన్‌ నుంచి వచ్చే కంపెనీల పెట్టుబడుల కోసం తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశ్రమలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉండేలా తమ ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సులో భాగంగా విశాఖకు వచ్చిన తైవాన్‌ ప్రతినిధుల బృందం తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయి పలు విషయాలపై చర్చించింది. తైపీ ఎకనామిక్‌ అండ్‌ కల్చర్‌ సెంటర్ ప్రతినిధి, ఆ దేశ రాయబారి ముమిన్‌ చెన్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం చంద్రబాబును కలిసి మాట్లాడింది.

ఆంధ్రప్రదేశ్‌లో పలు రంగాల్లో వచ్చే రకరకాల ప్రాజెక్టులకు అనుకూలంగా పారిశ్రామిక కారిడార్లను తయారు చేస్తున్నట్లు తైవాన్‌ బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు.. వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు వివరించారు. తైవాన్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ.. ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ వంటి అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని సీఎం చంద్రబాబు తైవాన్ కంపెనీలను ఆహ్వానించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos