ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న వివిధ రకాల ఒప్పందాల్లోని అక్రమాలు ఒకటొకటే బయటపడుతుండటం సంచలనం కలిగిస్తోంది. వాటిలో ఇటీవల బయటపడిన సెకి ఒప్పందం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - సెకితో కుదుర్చుకున్న సోలార్ పవర్ సప్లై అగ్రిమెంట్ విషయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కు ముడుపులు అందాయన్న ఆరోపణలు వచ్చిన క్రమంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఆధారాలు సబ్మిట్ చేశారు.
సెకి తో ఒప్పందాలు జరిగిన సమయంలో ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కు రూ.1750 కోట్ల ముడుపులు అందాయని అమెరికాలోని దర్యాప్తు సంస్థలు బయట పెట్టిన విషయం తెలిసిందే. ఛార్జిషీట్ లో వెల్లడించిన వివరాల ప్రకారం జగన్ తో అదానీ భేటీ అయి సోలార్ పవర్ డీల్ ను ఆయనకు మేలు చేసేలా సెటిల్ చేసుకున్నట్లు పలు సాక్ష్యాలు ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు. 2021లో ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరిగినా మన దర్యాప్తు సంస్థలు ఎందుకు బయటపెట్టలేదని ఆమె ప్రశ్నించారు.
ఇప్పటి కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గతంలోనే గతంలోనే అలా అయి అప్పటి జగన్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారని, ఈ అవినీతి వల్ల రాష్ట్ర ప్రజలపై భారీగా ఆర్థిక భారం పడబోతోందని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారని షర్మిల గుర్తుచేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై కూడా షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. 2021లోనే చంద్రబాబుకు ఇంత అవినీతి జరిగిందని తెలిసినా కూడా... ఇప్పటికీ ఆయన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జగన్ అరాచక విధానాల వల్ల ఆయనపై తీవ్ర వ్యతిరేకంతోనే ప్రజలు టీడీపీ కూటమికి ఓట్లు వేసి గెలిపించారని, అయినా చంద్రబాబు... సెకి ఒప్పందం పైనా, జగన్ అవినీతిపైనా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని... ఈ ఒప్పందంలో కీలక వ్యక్తి అయిన అదానీ పేరు పలకడానికే భయపడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీకి మిత్రుడైనందుకే అదానీ గురించి చంద్రబాబు మాట్లాడటం లేదా.... అదానీనీ కాపాడే పనిలో చంద్రబాబు బిజీగా బిజీగా గడుపుతున్నారా అని షర్మిల వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos