తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు మొత్తం 19 కమిటీలు ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు నేతృత్వంలో సభ నిర్వహణ కమిటీ ఏర్పాటు చేయగా.. ఏపీ విద్యా, ఐటీశాఖల మంత్రి లోకేశ్ నేతృత్వంలో సమన్వయ కమిటీ, అచ్చెన్న నేతృత్వంలో వసతుల కమిటీ, యనమల ఆధ్వర్యంలో తీర్మానాల కమిటీ, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బక్కని నర్సింహులు నేతృత్వంలో ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేశారు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డా అయిన కడప వేదికగా టీడీపీ మహానాడు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మే 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు టీడీపీ మహానాడు నిర్వహించనుంది.
మహానాడు కమిటీలు
ఆహ్వాన కమిటీ
1. పల్లా శ్రీనివాసరావు - రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్యే, కన్వీనర్
2. బక్కని నరసింహులు - పొలిట్ బ్యూరో సభ్యులు (తెలంగాణ)- కన్వీనర్
సమన్వయ కమిటీ
1. నారా లోకేష్ మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి - కన్వీనర్
2. పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్యే
3. కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి, కమిటీ సభ్యులు
4. పయ్యావుల కేశవ్ మంత్రి, కమిటీ సభ్యులు
5. అనగాని సత్య ప్రసాద్, మంత్రి, కమిటీ సభ్యులు
6. నిమ్మల రామానాయుడు, మంత్రి & జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, కమిటీ సభ్యులు
7. బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రి, కమిటీ సభ్యులు
8. ఎన్ అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, కమిటీ సభ్యులు
9. బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ, జోనల్ కో ఆర్డినేటర్, జాతీయ ప్రధాన కార్యదర్శి, కమిటీ సభ్యులు
10. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ, కమిటీ సభ్యులు
11. దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎంపీ, కమిటీ సభ్యులు
12. రాజేష్ కిలారు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కమిటీ సభ్యులు.
ఇదేవిధంగా తీర్మానాల కమిటీలో 22 మంది సభ్యులను, వసతి ఏర్పాట్ల కమిటీలో 25 మంది సభ్యులను నియమించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos