రాజకీయాల్లో గెలిచినప్పుడు ఉండే ఉత్సాహం వేరు, కానీ గెలిపించిన పార్టీకి చెందిన నిబంధనల గీత దాటినప్పుడు వచ్చే ఇబ్బందులు వేరు. ప్రస్తుతం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. గత కొద్ది రోజులుగా తన ప్రవర్తనతో సోషల్ మీడియా పోస్టులతో పార్టీని, పార్టీ నేతలను ఇరకాటంలో పెడుతున్న కొలికపూడికి టీడీపీ గట్టి షాక్ ఇచ్చింది. అసెంబ్లీ లాబీల్లోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆయనను పిలిచి క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది.

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పల్లా శ్రీనివాసరావు కొలికపూడిని పక్కకు పిలిచి హెచ్చరించారు. పార్టీ లేకపోతే వ్యక్తిగతంగా జీరో అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మీరు పెట్టే ఆ వాట్సాప్ స్టేటస్‌లు ఏంటీ? ఎవరి మీద మీరు పోరాటం చేస్తున్నారు? పార్టీ క్రమశిక్షణ దాటితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అని పల్లా స్పష్టం చేశారు. అంటే ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి నేనే పెద్ద లీడర్ అనుకుంటే కుదరదని, పార్టీ గీసిన గీత లోపలే ఉండాలని వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. కొలికపూడి శ్రీనివాస్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన వ్యవహార శైలి ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. నియోజకవర్గంలోని సమస్యల మీద, లేదా పార్టీలోని ఇతర నాయకులపై ఆయన పెడుతున్న పోస్టులు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. ఒక ప్రజాప్రతినిధిగా ఉండాల్సిన సంయమనం లేకుండా, బహిరంగ వేదికలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారుతున్నాయి. పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగత అజెండాతో ముందుకు వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి కొలికపూడి చెప్పే సమాధానం నేను కొత్తగా ఎమ్మెల్యే అయ్యానని,  అనుభవరాహిత్యం వల్ల పొరపాట్లు జరిగి ఉండొచ్చు అని చెబుతున్నారు. సీనియర్లు చెబితే సరి చేసుకుంటానంటూ సమర్థించుకున్నారని సమాచారం

కాగా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని, కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిని ఉద్దేశించి ఎప్పటికప్పుడు చంద్రబాబు,లోకేష్‌ సహా సీనియర్లంతా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని చెప్పారు. చేసే పనులు పార్టీలైన్‌లో లేకుంటే అనవసరమైన గొడవలకు దారితీస్తుందని అన్నారు. వ్యక్తిగత అహంకారం ఎప్పుడూ పార్టీ లక్ష్యాల కంటే పెద్దది కాకూడదని కూడా చంద్రబాబు గతంలో హెచ్చరించారు. చంద్రబానే నేరుగా ఒకసారి పిలిచి శ్రీనివాస్‌తో మాట్లాడారు. అయినా ఆయన తీరులో మార్పు రాలేదు. అయితే ఇప్పుడు కొలికపూడికి ఇచ్చింది చివరి హెచ్చరికని పార్టీ వర్గాలు అంటున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos