ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వారికి మరింత దగ్గరవుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు చూపించిన దయా హృదయానికి స్థానికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సరిగ్గా 4 నెలల క్రితం.. అంటే గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన మడకశిర మండలం హెచ్ఆర్‌హళ్ళిలో నరసింహప్ప అనే నిరుపేద కుటుంబాన్ని ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు కలిశారు. ఆ సమయంలో వారు తమ కష్టాలను ఎమ్మెల్యేకు చెప్పుకున్నారు. ఉండేందుకు కనీసం ఇల్లు లేక గత 7 ఏళ్లుగా బాత్రూంలోనే జీవిస్తున్నట్లు చెప్పడంతో అది విని.. ఎమ్మెల్యే చలించిపోయారు. ఈ క్రమంలోనే బాత్రూంలో ఉంటున్న నరసింహప్ప కుటుంబ పరిస్థితిని స్వయంగా చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ కుటుంబానికి కొత్తగా ఇల్లు నిర్మించి ఇస్తానని అప్పుడు హామీ ఇచ్చారు.

వెంటనే వారికి తక్షణ సాయంగా నరసింహప్ప కుటుంబానికి రూ.20వేల ఆర్థిక సహాయం అందించారు. వెంటనే ఆ బాత్రూంను ఖాళీ చేసి అద్దె ఇంట్లోకి వెళ్లి నివసించాలని వారికి ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు సూచించారు. అది జరిగిన ఒక్క రోజులోనే నరసింహప్ప కుటుంబానికి అదే హెచ్ఆర్ హళ్లి గ్రామంలో రెండు సెంట్లు స్థలాన్ని మంజూరు చేయించారు. ఆ తర్వాత తన సొంత డబ్బులతో వారికి కొత్త ఇల్లు నిర్మించి ఇస్తానని.. ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

నరసింహప్ప కుటుంబానికి ఇచ్చిన మాట ప్రకారం మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు.. 4 నెలల్లోనే ఆ ఇంటి నిర్మాణం పూర్తి చేయించారు. దాదాపు రూ.6 లక్షల వ్యయంతో ఒక హాల్, బెడ్‌రూమ్, కిచెన్‌తో కూడిన ఇంటిని కట్టించి.. నరసింహప్ప కుటుంబానికి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఇంటి తాళాలు అందించారు. అప్పటివరకు బాత్రూంలో జీవనం సాగించిన నరసింహప్ప కుటుంబానికి.. సొంత డబ్బులతో ఇల్లు కట్టించిన ఎమ్మెల్యేపై హెచ్ఆర్ హళ్లి గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు. ఇక తమ కుటుంబ పరిస్థితిని చూసి.. అంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టించిన ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుపై తీవ్ర భావోద్వేగానికి గురైన నరసింహప్ప కుటుంబమే కాకుండా ఆ గ్రామస్తులందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos