టీడీపీ అధికార యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. బుధవారం ఉదయం నుంచి హఠాత్తుగా ఆగిపోయింది. ఛానల్ ఓపెన్ చేసిన వారికి స్ట్రక్ అయినట్లు వస్తుందని కొందరు నేతలు పేర్కొన్నారు. చానల్ ను హ్యాక్ చేసిన వారిని గుర్తించేందుకు టీడీపీ టెక్నికల్ వింగ్ రంగంలోకి దిగగా.. మరోవైపు టీడీపీ వర్గాల వారు యూట్యూబ్ యాజమాన్యానికి ఛానల్ హ్యాక్ అయినట్లుగా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఛానల్ పునరుద్దరణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

టీడీపీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవడంతో అందులో ప్రసారాలన్నీ ఆగిపోయాయి. ఆ ఛానల్ లో టీడీపీకి సంబంధించిన ప్రెస్ మీట్‌లు, సీఎం చంద్రబాబు పర్యటనలు, పలు మీటింగ్‌లు, కార్యకర్తలు మాట్లాడుతున్న లైవ్‌లు, పార్టీకి సంబంధించి పలు కార్యక్రమాలు  ప్రసారమవుతాయి. పార్టీకి చెందిన ముఖ్య నేతలు, పలువురు ఈ ఛానల్‌ను ఫాలో అవుతుంటారు. అయితే బుధవారం ఉదయం ఛానల్ ఓపెన్ చేయగా ‘ది పేజ్ నాట్ అవైలబుల్' అని చూపించడంతో.. అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా ఛానల్ హ్యాక్ అయిన విషయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వీరిద్దరు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే ఛానల్ పునరుద్ధరించాలని కేంద్ర కార్యాలయ వర్గానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.

కాగా గతంలో టైలర్ హాబ్స్ పేరుతో సైబర్ కేటుగాళ్లు.. టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యూట్యూబ్ ఛానల్‌ను హ్యాక్ చేసింది ఎవరు..ఎక్కడి నుంచి చేశారన్న కోణంలో కనిపెట్టేందుకు టెక్నికల్ విభాగం ప్రయత్నిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos