అమరావతి : పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బాండ్లను తక్షణమే విడుదల చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల కమిషనర్లు,అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల అధికారులతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సెక్రటరీ కన్నబాబు, డైరెక్టర్ హరినారాయణన్, పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యుల్లత హాజరయ్యారు. ఆయా మున్పిపాల్టీలు, యూడీఏల వారీగా పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బాండ్ల గురించి అధికారులతో చర్చించారు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో పలు మున్సిపాల్టీల్లో పెద్ద ఎత్తున అవకతకవలు జరిగినట్లు గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుంభకోణంపై కమిటీలు వేసి దర్యాప్తు చేసింది. అయితే గతంలో జరిగిన అక్రమాల దృష్ట్యా కొన్ని రోజుల పాటు టీడీఆర్ బాండ్ల జారీని నిలిపివేసింది ప్రభుత్వం.. ఆ తర్వాత ఆన్ లైన్ లో బాండ్ల జారీని ప్రారంభించినప్పటికీ కొన్నిచోట్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తుంది. ఈ విషయం మంత్రి నారాయణ దృష్టికి రావడంతో ఈరోజు కీలక ఆదేశాలు జారీచేసారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న జారీ చేయాల్సిన టీడీఆర్ బాండ్లు 437 పెండింగ్ లో ఉన్నాయి. ఈ బాండ్లను ఈ రాత్రి లోగా ఆన్ లైన్ లో లబ్దిదారులకు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగిన బాండ్ల విషయంలో మినహా మిగతావాటిని క్లియర్ చేయాలని సూచించారు.
ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ 654 దరఖాస్తులు టీడీఆర్ బాండ్ల కోసం వచ్చాయి...వీటిపై ప్రస్తుతం ఆయా మున్పిపాల్టీలు పరిశీలన చేస్తున్నాయి...ఈ దరఖాస్తులను రెండు మూడు రోజుల్లోగా జారీ చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. టీడీఆర్ బాండ్ల కోసం ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos