ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీకి రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు ప్రణాళికలు రూపొందించింది. ఉపాధ్యాయ సంఘాలతో చర్చల తరువాత మార్గదర్శకాలకు తుది రూపం ఇచ్చింది. ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సర్వీసుకు ప్రామాణిక తేదీగా మే 31ని నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో అంధ టీచర్లకు బదిలీల నుంచి మినహాయించారు. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీల ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. రాష్ట్రంలో బదిలీల చట్టం ప్రకారం మొదటిసారి ఈ ప్రాసెస్ నిర్వహించనున్నారు. ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ కొంతమంది అంధ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించగా స్టేటస్‌కో విధించింది. దీంతో అంధ ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించిన బదిలీలను మినహాయించి, మిగతా వాటికి ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆప్షన్స్ పెట్టుకునేందుకు మాత్రం వారికి అవకాశం కల్పిస్తున్నారు.

బదిలీల్లో భాగంగా మొదట ప్రధానోపాధ్యాయులను బదిలీ చేయనున్నారు. దాంతో ఖాళీ అయిన స్థానాలు, కొత్తగా అవసరమయ్యే వాటిల్లో స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రమోషన్లు కల్పిస్తారు. తర్వాత మిగతా ప్రక్రియ ఉంటుంది. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల అవసరాల మేరకు సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు పదోన్నతులు కల్పిస్తారు. కాకపోతే స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల అవసరం చాలా తక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఎస్జీటీలకు ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పదోన్న తులు కల్పిస్తారు. కొంతమంది సబ్జెక్టు టీచర్లకూ ఆదర్శ పాఠశాలల హెచ్‌ఎంలుగా అవకాశం ఇవ్వనున్నారు. బదిలీలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. మే 31వ తేదీ నాటికి 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, అయిదేళ్ల సర్వీసు పూర్తయిన హెచ్‌ఎంలను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.

మే 31వ తేదీ నాటికి 2 సంవత్సరాల సర్వీసు మాత్రమే ఉండే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయించారు. కావాలనుకుంటే వారూ దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్ట్​ను విద్యాశాఖ సిద్ధం చేసింది. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన GO-117కు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేశారు. గరిష్ఠ సర్వీసు పూర్తయి బదిలీల్లో స్టేషన్ల ఎంపికకు ఆప్షన్స్ ఇవ్వకపోతే ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన స్థానాలకు బదిలీ చేస్తారు. అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటారు. ఆదర్శ పాఠశాలలకు ఈ చట్టం నుంచి మినహాయించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos