ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్‌లోనే అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చిందని చెప్పారు. అప్పుడప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నామన్నారు. విజయవాడలో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో బుధ‌వారం నిర్వహించిన టెక్ ఏఐ కాంక్లేవ్‌కు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ.. టెక్నాలజీని అందరూ ఫాలో కావాల్సిందేనని చెప్పారు. గతంలో ఎంట్రపెన్యూర్‌లను ప్రోత్సహించుకోవడానికి జీఎఫ్ఎస్టీ లాంటి సంస్థను తెచ్చామని గుర్తు చేశారు. లైవ్ స్టాక్‌పై 42 లక్షలు మంది ఆధారపడ్డారని, 13.5 శాతం జీఎస్టీ కాంట్రిబ్యూషన్ లైవ్ స్టాక్ ద్వారా వస్తోందని వివరించారు.

“నేను నిత్య విద్యార్ధిని. అనునిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను.” అని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులకు ఉపయోగపడేలా అప్లికేషన్స్ తయారు చేస్తున్న స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. రైతులకు ఉపయోగపడేలా వాట్సాప్‌లోనే అన్ని సేవలు అందించేలా అప్లికేషన్ తయారు చేయాలని సూచించారు. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసే విధానాల‌కు పెద్ద‌పీట వేస్తున్నామ‌ని, ప్రతి ఒక్కరూ సాంకేతికతలో సమర్థత పెంచుకోవాల‌ని సూచించారు.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉన్నారని .. అందులో తెలుగువాళ్లే అధికమ‌ని గుర్తు చేశారు. మనం బాగుంటేనే చాలద‌ని.. మ‌న‌తో పాటు స‌మాజం కూడా బాగుండాల‌ని, అందుకు సంపాద‌న‌లో కొంతైనా తిరిగి సమాజానికి ఇవ్వాల‌ని పిలుపునిచ్చారు.

ఏపీలో 1000 కిలోమీటర్లకు పైగా ఉన్న సముద్ర తీరాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మారిటైం ప్రాజెక్టులు నెలకొల్పుతామని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. దుగరాజపట్నంలో నౌకా నిర్మాణం, మరమ్మతుల క్లస్టర్‌, గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్‌తో కలిపి అభివృద్ధి చేసేందుకు విభజన హామీలో భాగంగా కేంద్రం అంగీకరించిందని, అందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అభివృద్ధిని ప్ర‌స్తావిస్తూ, గతంలో ఎక్కడ చూసినా రహదారులు గుంతలతో కనిపించేవన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లను చక్కగా నిర్మించామ‌ని తెలిపారు. ఇప్పుడు ఎక్కడ చూసినా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోంద‌ని చంద్రబాబు అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos