బీహార్ రాజకీయాల్లో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష ‘మహాఘటబంధన్’ (మహాకూటమి) తన ముఖ్యమంత్రి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ నాయకత్వంలోనే కూటమి ఎన్నికల బరిలోకి దిగనుందని స్పష్టం చేసింది. పాట్నాలోని మౌర్య హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి భాగస్వామ్య పక్షాల నేతల సమక్షంలో ఈ కీలక ప్రకటన వెలువడింది.

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీహార్ కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ అశోక్ గెహ్లాట్.. తేజస్వి యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ముఖేశ్ సహానీ పేరును కూడా ఆయన ఖరారు చేశారు. "తేజస్వి యాదవ్ ఒక యువ నాయకుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి. ఆయనకు సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉంది. అందుకే, ఆయన నాయకత్వంలోనే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని మేమంతా నిర్ణయించామని"  అశోక్ గెహ్లాట్ ఈ సందర్భంగా తెలిపారు. సీట్ల పంపకాలు, సీఎం అభ్యర్థిత్వంపై ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. 2020 ఎన్నికల్లో కేవలం 19 సీట్లు గెలిచినప్పటికీ, ఈసారి కూడా తమకు 70 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. అయితే, కాంగ్రెస్ గత ప్రదర్శన దృష్ట్యా అన్ని సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సుముఖత చూపలేదు. దీంతో కూటమిలో ప్రతిష్టంభన ఏర్పడింది.

పరిస్థితి చేయిదాటిపోతుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. సమస్య పరిష్కార బాధ్యతను అశోక్ గెహ్లాట్‌కు అప్పగించింది. పాట్నాకు చేరుకున్న ఆయన.. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి, తేజస్వి యాదవ్‌లతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగానే కూటమిలోని అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని, అందరం కలిసికట్టుగా ఎన్నికల్లో పోరాడతామని గెహ్లాట్ ప్రకటించారు. తాజా ఒప్పందం ప్రకారం, ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ నిర్ణయంతో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కొనేందుకు మహాకూటమి ఐక్యంగా సిద్ధమైనట్లయింది. ఈ పరిణామం కూటమి ప్రచారానికి కొత్త ఊపునిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos