టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కు కాసింత ఉపశమనం లభించింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మహిళ మృతి కేసులో అల్లు అర్జున్ గతంలోనే హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఆయనకు ఇవాళ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కాగా ఇవాళ ఉదయం ఇదే కేసులో అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన పోలీసులు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఆయనకు రెండు వారాల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను చంచల్ గూడ జైలుకు కూడా తరలించారు. అదే సమయంలో హైకోర్టులో గతంలో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ నిర్వహించి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం గమనార్హం.
వాస్తవానికి హైకోర్టులో జరిగిన విచారణలో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇచ్చేందుకు న్యాయస్ధానం నిరాకరించిది. అదే సమయంలో కనీసం మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని ఆయన న్యాయవాదులు కోరగా... దీనిపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. అయినా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ... అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కేసుపై న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. కేవలం నటుడు కాబట్టే ఆయనపై ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారా అని పోలీసుల్ని ప్రశ్నించడమే కాకుండా... ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని తెలిపింది. అల్లు అర్జున్ కు కూడా జీవించే హక్కు ఉందని... అయితే మృతురాలు రేవతి కుటుంబంపై మాత్రం తమకు సానుభూతి ఉందని న్యాయస్థానం తెలిపింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos